Guntur Kaaram: సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చాడు మహేష్ బాబు. ఆయన లేటెస్ట్ మూవీ గుంటూరు కారంపై మరింత అంచనాలు ఉన్నాయి. దశాబ్దం తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ తో చేస్తున్న చిత్రం ఇది. అలాగే హ్యాట్రిక్ చిత్రం. గతంలో వీరి కాంబోలో అతడు, ఖలేజా చిత్రాలు చేశారు. గుంటూరు కారం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. 2024 జనవరి 12న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా విడుదల తేదీ ప్రకటించారు.
మహేష్ ఫ్యాన్స్ ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గుంటూరు కారం షూటింగ్ సవ్యంగా సాగలేదు. అనేక మార్పులు జరిగాయి. పూజ హెగ్డే ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. సెకండ్ లీడ్ కోసం తీసుకున్న శ్రీలీల మెయిన్ హీరోయిన్ అయ్యింది. మీనాక్షి చౌదరి ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అయ్యింది. కొందరు టెక్నీషియన్స్ కూడా మారారు. ఈ క్రమంలో చెప్పినట్లు సంక్రాంతికి విడుదల చేస్తారా లేదా? అనే సందేహాలు ఉన్నాయి.
అయితే సంక్రాంతి బరిలో నిలవాలని యూనిట్ గట్టి పట్టుదలతో ఉన్నారు. అందుకే శరవేంగా షూటింగ్ పూర్తి చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఓ సాంగ్ షూటింగ్ కోసం గుంటూరు కారం టీమ్ కేరళ వెళ్లారు. డిసెంబర్ 25 నాటికి మహేష్ బాబు పార్ట్ పూర్తి అవుతుందట. మహేష్ గుంటూరు కారం చిత్రీకరణకు గుడ్ బై చెప్పేయనున్నారట. ఈ మేరకు సమాచారం అందుతుంది.
గుంటూరు కారం చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. గుంటూరు కారం మూవీలో మహేష్ బాబు లుక్ అండ్ మాస్ మేనరిజం ఆకట్టుకున్నాయి. గుంటూరు కారం అనంతరం మహేష్ బాబు రాజమౌళి చిత్రానికి సిద్ధం అవుతారు. రాజమౌళి స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు. స్క్రిప్ట్ తుది దశకు చేరిందని సమాచారం. 2024 ప్రారంభంలో ప్రీ ప్రొడక్షన్ కూడా మొదలుకానుందట. మహేష్-రాజమౌళి చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.