Guntur Karam Movie : గుంటూరు కారం రిలీజ్ డేట్ ఫిక్స్ : బాలయ్య, ప్రభాస్ తో మహేష్ ఢీ…

ఇంకా వీళ్ళతోపాటు వేరే స్టార్ హీరోలు కూడా సంక్రాంతి బరిలో నిలుచేలానే ఉన్నారు. మరి వాళ్ళెవరో తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాలి...

Written By: NARESH, Updated On : October 3, 2023 10:16 pm

Guntur Karam Movie

Follow us on

Guntur Karam Movie : సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా సక్సెస్ ఫుల్ గా నడవాలి అంటే ఆ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ అనేది చాలా ముఖ్యం…ఇక సినిమాలు ముఖ్యంగా పండగ సీజన్ లో రిలీజ్ చేస్తే ఆ సినిమాలు ఎక్కువ కలక్షన్స్ ను రాబడతాయి అనేది అందరికీ తెలిసిన విషయమే… ఎందుకంటే పండుగ సీజన్ లో ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక దగ్గర కలిసి మీట్ అవుతూ ఉంటారు.

కాబట్టి వాళ్లందరూ ఎంటర్ టైన్ మెంట్ కోసం సినిమా చూడడానికి ఎక్కువ ఫ్రిఫర్ చేస్తారు. దానివల్ల తన వల్ల ఆ సినిమాలకి ఎక్కువ కలక్షన్స్ రావడం జరుగుతుంది.అందుకే దర్శక, నిర్మాతలు కూడా పండుగ సీజన్ ని క్యాష్ చేసుకోవడానికి ఆ సీజన్ లలోనే వాళ్ళ సినిమాలను రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో దసర, సంక్రాంతి పండుగలు చాలా పెద్ద పండుగలుగా జరుపుకుంటాం కాబట్టి ఆ సీజన్ లలో స్టార్ హీరోలు వాళ్ళ సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడానికి థియేటర్లోకి వస్తుంటారు.

ఇక ప్రస్తుతం సంక్రాంతి బరిలో ఇప్పటికే చాలా సినిమాలు నిలిచాయి. ఇప్పుడు కొత్తగా మహేష్ బాబు హీరోగా వస్తున్న గుంటూరు కారం సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయడం జరిగింది.ఈసినిమా కూడా సంక్రాంతి కనుక గా జనవరి 12వ తేదీన మన ముందుకు రాబోతున్నట్టుగా ఆ సినిమాకు సంబంధించిన అప్డేట్ ని ఆ చిత్ర యూనిట్ చెప్పడం జరిగింది. ఇక సంక్రాంతి బరిలో ఇప్పటికే రవితేజ ఈగల్ సినిమాతో జనవరి 13వ తేదీన వస్తున్నట్లుగా తెలుస్తుంది. రీసెంట్ గా ఆ సినిమాకు సంబంధించిన ఒక పోస్టర్ ని రిలీజ్ చేస్తూ సినిమా డేట్ ని కూడా అనౌన్స్ చేశారు. ఇక ఇప్పటికే ప్రభాస్ హీరోగా వస్తున్న ప్రాజెక్టుకే (కల్కి 2898) సినిమా కూడా సంక్రాంతి బరిలో ఉంది.

ఇక వీటితో పాటుగా బాలయ్య బాబు హీరోగా బాబీ డైరెక్షన్ లో వస్తున్న ఎన్.బి.కె 109 సినిమా కూడా సంక్రాంతి బరిలో ఉంది ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. బాలయ్య దసరాకి కూడా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చేస్తున్న భగవంతు కేసరి సినిమాని రిలీజ్ చేస్తున్నాడు.ఈ సినిమా ఈనెల 16 వ తేదీన రిలీజ్ అవుతుంది.ఇక దసరా తో పాటు గా బాలయ్య మీద కూడా కన్నేశాడు.ఇప్పటికే బాలయ్యకి సంక్రాంతి సీజన్ బాగా కలిసి వచ్చింది.ఇంతకు ముందు ఆయన చేసిన నరసింహనాయుడు మొన్న వచ్చిన వీర సింహారెడ్డి రెండు సినిమాలు కూడా సంక్రాంతి బరిలో నిలిచి సూపర్ సక్సెస్ సాధించడంతో బాలయ్య ఈసారి కూడా సంక్రాంతి బరిలో నిలవాలని ఈ సినిమాని తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇక మహేష్ బాబు కూడా ఇంతకుముందు బిజినెస్ మేన్ , సరిలేరు నీకెవరు లాంటి సినిమాలతో సంక్రాంతి హీరోగా వచ్చి మంచి విజయాలను అందుకున్నాడు… ఇప్పుడు మళ్లీ గుంటూరు కారం సినిమాతో సంక్రాంతికి వచ్చి మహేష్ బాబు తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఇలా ఇప్పటివరకు సంక్రాంతి సీజన్ క్యాష్ చేసుకుంటూ ప్రభాస్, మహేష్ బాబు,బాలయ్య బాబు, రవితేజ లాంటి హీరోలు సంక్రాంతి బరిలో నిలిచారు. ఇంకా వీళ్ళతోపాటు వేరే స్టార్ హీరోలు కూడా సంక్రాంతి బరిలో నిలుచేలానే ఉన్నారు. మరి వాళ్ళెవరో తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాలి…