Guntur Kaaram Records: తెలుగు సినీ ఇండస్ట్రీలో మహేష్ బాబు సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఎదురుచూసే టైమొచ్చింది. ఎందుకంటే ఈ యంగ్ అండ్ సీనియర్ హీరో సినిమాలు వరుసగా హిట్ ఖాతాలో పడ్డాయి. ‘శ్రీమంతుడు’ నుంచి ‘సర్కారు వారి పాట’ వరకు అన్ని ఎంతో కొంత విజయాలు సొంతం చేసుకున్నవే. వీటిలో ఒక్కటి కూడా డిజాస్టర్ గా నిలవలేదు. ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, మహేష్ బాబు హిట్ ఫెయిర్ అన్న విషయం తెలిసిందే. వీరి కాంబోలో ఒకటి హిట్టు, మరొకటి ఫట్టు కొట్టింది. అయినా ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి ‘గుంటూరు కారం’తో శుక్రవారం థియేటర్లోకి రానున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఫ్రీ రిలీజ్ బిజినెస్ గురించి ఓ టాపిక్ హాట్ హాట్ గా చర్చ సాగుతోంది. గతంలో కంటే ఈ మూవీ బిజినెస్ లో మహేష్ బాబు బెస్ట్ రికార్డు సాధించినట్లు తెలుస్తోంది.
మహేష్ బాబు లేటేస్టుగా నటిస్తున్న ‘గుంటూరు కారం’ జనవరి 12న థియేటర్లోకి రానుంది. ఇప్పటికే ఈ మూవీ గురించి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ ఎంత ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీ ట్రైలర్ కూడా విపరీతంగా ఆకట్టుకోవడంతో సినిమా కోసం ఆవురావురుమంటూ ఎదురుచూస్తున్నారు. మొత్తానికి సంక్రాంతికి మంచి స్టఫ్ ఇచ్చే లా ముందే రిలీజ్ చేయడంతో సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని అంటున్నారు.
అయితే అంతకంటే ముందే మహేష్ మూవీ బిజినెస్ లో రికార్డు సృష్టించింది. ప్రిన్స్ లాస్ట్ నటించిన ‘సర్కారు వారి పాట’ కంటే ఈ మూవీ 18 కోట్లు అదనంగా బిజినెస్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. గత మూవీ సర్కారు వారి పాట మహేష్ కెరీర్ లోనే రికార్డు బిజినెస్ 118 కోట్లు చేయగా.. ఇప్పడు గుంటూరు కారం దాని కంటే 18 కోట్లు అదనంగా అంటే 136 కోట్లు చేయడం విశేషం. ఇప్పుడే ఈ మూవీ ఇలా ప్రభంజనం సృష్టిస్తే ఇక రిలీజ్ అయ్యాక ఎలాంటి హంగామా సృష్టిస్తుందోనని చర్చించుకుంటున్నారు.
ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే.. నైజాం రూ.42 కోట్లు, సీడెడ్ 13.75 కోట్లు, ఉత్తరాంధ్ర 14 కోట్లు, ఈస్ట్ 8.6 కోట్లు, వెస్ట్ 6.5, గుంటూరు 7.65 కోట్లు, కృష్ణా 6.50 కోట్లు, నెల్లూరు 4 కోట్ల బిజినెస్ చేసింది. తెలంగాణ, ఆంధ్రా కలిపి 102 కోట్లు చేయగా.. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 9 కోట్ల బిజినెస్ చేసింది. ఓవర్సీస్ 20 కోట్ల బిజనెస్ మార్క్ దాటడం విశేషం. మొత్తంగా ఈ మూవీ ఇప్పటికే 132 కోట్ల బిజినెస్ చేసింది. అయితే రూ.135 కోట్ల బిజినెస్ చేస్తే… హిట్టు వచ్చినట్లే అన్న చర్చ సాగుతోంది.