https://oktelugu.com/

Ambati Rayudu: ‘అంబటి’.. ఇంత నిలకడ లేమి ఏమిటి?

అంబటి రాజకీయ ప్రవేశం విమర్శలతో మొదలు కావడం గమనార్హం. అంబటిలో స్థిరత్వం లేకపోవడం విమర్శలకు ప్రధాన కారణం అవుతోంది. క్రికెట్ లో ఎలాగూ నిలకడ లేకుండా పోయారు.

Written By:
  • Dharma
  • , Updated On : January 11, 2024 / 06:19 PM IST

    Ambati Rayudu

    Follow us on

    Ambati Rayudu: ఏపీ సీఎం జగన్ కు అంబటి రాయుడు మైండ్ బ్లాక్ అయ్యేలా ట్విస్ట్ ఇచ్చారు. తనకు క్రికెట్ ఒక్కటే కాదు.. రాజకీయ చదరంగం తెలుసు అని ఆడి చూపించారు. పది రోజుల్లోనే ఇద్దరు పార్టీల అధినేతలను కలిసి పొలిటికల్ గేమ్ ఆడారు. వైసీపీలో చేరిన వారం రోజులకే ఆ పార్టీని వీడి ఝలక్ ఇచ్చారు. మళ్లీ క్రికెట్ ఆడేందుకే ఈ నిర్ణయం అంటూ చెప్పుకొచ్చారు. మళ్లీ యూటర్న్ తీసుకొని జనసేన అధినేత పవన్ తో సమావేశం అయ్యారు. తనకు వైసీపీలో పద్ధతులు నచ్చలేదని.. పవన్ అన్నతో ప్రయాణిస్తానని చెప్పుకొచ్చారు. రోజుకో మాట చెబుతూ.. క్రికెట్ కంటే రాజకీయ క్రీడల్లో బాగా రాణిస్తానని అంబటి నిరూపించుకున్నారని సెటైర్లు పడుతున్నాయి. మీమ్స్ జత చేసి వైసిపి సోషల్ మీడియా విభాగం ఆయనపై పోస్టులను ట్రోల్ చేస్తోంది.

    అంబటి రాజకీయ ప్రవేశం విమర్శలతో మొదలు కావడం గమనార్హం. అంబటిలో స్థిరత్వం లేకపోవడం విమర్శలకు ప్రధాన కారణం అవుతోంది. క్రికెట్ లో ఎలాగూ నిలకడ లేకుండా పోయారు.. కనీసం రాజకీయాల్లోనైనా నిలకడగా ఉంటే మేలని నెటిజెన్లు సెటైర్లు వేస్తున్నారు. వైసీపీ శ్రేణులు అయితే ఓ రేంజ్ లో వేసుకుంటున్నారు. ఓ సినిమాలో తనికెళ్ల భరణి పార్టీపై చేసే వ్యాఖ్యలను లైన్ గా తీసుకొని.. వీడియోలను జత చేస్తున్నారు. అదే పనిగా ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

    అంబటి రాయుడు క్రికెట్ టీం లో ఉండగానే వార్తల్లో నిలిచారు. ఒకవైపు క్రికెట్ ఆడుతుండగానే రాజకీయాలపై మాట్లాడుతూ తనలోనున్న ఆసక్తిని బయట పెట్టుకున్నారు. రాజకీయాల్లోకి వస్తే ఒంటి చేత్తో ఇన్నింగ్స్ చేస్తానని లేనిపోని ప్రచారం తనకు తానుగా కల్పించుకున్నారు. కానీ వైసీపీలో చేరిన వారం రోజులకే తిరుగు ముఖం పట్టారు. అక్కడి నుంచి యూటర్న్ తీసుకుని పవన్ కళ్యాణ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. మళ్లీ క్రికెట్ లీగ్ ఆడతానని.. అంతవరకు క్రికెట్ కు ఫుల్ స్టాప్ పెడతానని చెప్పుకొస్తున్నారు. అంబటి రాయుడు నిలకడలేమిని చూసి నెటిజన్లు తెగ ఆడేసుకుంటున్నారు.