Guntur Kaaram: తెలుగు సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ త్రివిక్రమ్ సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ముఖ్యంగా ఇప్పుడు ఆయన మహేష్ బాబుతో గుంటూరు కారం అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా మంచి విజయం సాధించాలని చాలామంది అభిమానులు కోరుకుంటున్నారు ఇక ఈ సినిమా పైన తెలుగు సినిమా ఫ్యాన్స్ అందరూ కూడా మంచి అంచనాలను పెట్టుకున్నారు.
త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్ లో ఇంతకుముందు అతడు, ఖలేజా లాంటి సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు కూడా ఇప్పటికీ టివి ల్లో వస్తే చాలా మంది జనాలు చూస్తూ ఉంటారు.అవి రెండింటి కంటే కూడా వీళ్ల కాంబో లో వచ్చే ఈ మూడో సినిమా ఎంత పెద్ద విజయం సాధిస్తుందో అనే ఒక ఉత్కంఠ అందరిలో నెలకొంది. ఇక ఇలాంటి సమయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నట్టు గా తెలుస్తుంది. అయితే ఈ సినిమా ఇప్పటికి ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది కానీ అనుకోని కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ అనేది లేట్ అవుతూ వస్తుంది.
ఎట్టకేలకు ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు గా ప్రకటించారు. అయితే ఇప్పుడు సినిమాకు సంబంధించిన ఒక చర్చ విపరీతంగా నడుస్తుంది. అదేంటంటే ఒక వ్యక్తి గుంటురు కారం అనే సినిమా స్టోరీ నాది అంటూ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా ఫైల్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమా స్టోరీ తను త్రివిక్రమ్ ని కలిసినపుడు చెప్పానని ఆ వ్యక్తి చెప్తున్నాడు.ఇలాంటి క్రమం లో ఈ స్టోరీ నాది అంటూ ఇంతకుముందు కూడా వేరే సినిమాల విషయం లో ఇలాంటి కథనాలు రావడం మనం తరుచుగా చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు ఓ వ్యక్తి ఈ స్టోర్ నాది నేను త్రివిక్రమ్ గారికి 2018 లో ఈ స్టోరీ చెప్పాను అంటూ చెప్తున్నాడు. అయితే ఆ వ్యక్తి మాటల్లో ఎంతవరకు నిజం ఉంది అనే విషయాలను కూడా ఇప్పుడు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది…
ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమా చేయబోతున్నాడు.అందుకే ఈ సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేసి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మహేష్ బాబు రాజమౌళి సినిమా లో పాల్గొననున్నట్టుగా తెలుస్తోంది…ఇక ఈ సినిమా స్టోరీ ఎవరిది అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే…అయితే ఇది చూసిన త్రివిక్రమ్ అభిమానులు మాత్రం త్రివిక్రమ్ ఏ సినిమా చేసిన అది కాపీ అంటూ కామెంట్లు చేసే వాళ్ల పైన ఫైర్ అవుతున్నారు…