Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన గుంటూరు కారం సినిమాకు సంబంధించి ప్రతి ఒక్కరు ఈ సినిమాని బాగుంది అని చెప్తున్నప్పటికీ, త్రివిక్రమ్ మహేష్ బాబు రేంజ్ లో అయితే ఈ సినిమా లేదని మరి కొంతమంది చెప్తున్నారు. నిజానికి ఈ సినిమా భారీ అంచనాలతో రిలీజ్ అయినప్పటికీ ప్రేక్షకులను అలరించడం లో ఈ సినిమా కొంతవరకు తడబడుతుందనే చెప్పాలి. మరి గురూజీ లెక్క ఎందుకు తప్పింది అనేది మనం అంచనా వేస్తే ఈ సినిమా మీద త్రివిక్రమ్ మొదటి నుంచి కూడా పెద్దగా ఇంట్రెస్ట్ లేనట్టుగా కనిపిస్తు వచ్చాడు.
అందుకే గురూజీ ఈ సినిమా మీద పెద్ద గా కేరింగ్ అయితే తీసుకొని చేసినట్టుగా మనకు ఎక్కడ అనిపించడం లేదు అంత లైట్ వెయిట్ తో, జీరో ఎమోషన్స్ తో రాసుకున్న సీన్లు, ఎక్కడ కూడా వినాలి అనిపించే డైలాగులు లేకపోవడం, ఇంట్రెస్ట్ కలిగించని స్క్రీన్ ప్లే, తెలుసుకోవడానికి కూడా బోర్ కొట్టించే కథ వీటన్నింటి వల్ల ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేదంటూ ఇప్పుడు ఈ సినిమా చూసిన కొంత మంది ప్రేక్షకులు చెప్తున్నారు. గురూజీ లెక్క తప్పడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ సినిమాలో మహేష్ బాబు ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైందంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాని ఏదో ఒప్పుకున్నందుకు కానిచ్చేశాడు తప్ప ఆయన పూర్తి ఎఫర్ట్ ని పెట్టినట్టుగా కనిపించడం లేదు.
ఇక ఈ సినిమాతో మహేష్ బాబుకి కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ఇస్తాడని అనుకున్న త్రివిక్రమ్ ఈ సినిమాని కూడా సక్సెస్ అయితే చేశాడు. కానీ తన గత చిత్రాలు అయిన అతడు, ఖలేజా లాంటి సినిమాలు ఎలా ఒకే అనిపించుకునే న్నాయో ఈ సినిమా కూడా అలానే ఓకే అనిపించాలానే ఉంది అంటూ ప్రేక్షకుల నుంచి విపరీతమైన కామెంట్లు అయితే వస్తున్నాయి.
మరి ఈ సినిమా లాంగ్ రన్ లో ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న పాన్ వరల్డ్ సినిమాలో జాయిన్ అవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమాతో మహేష్ బాబు ఒక్కసారిగా పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు…