Guess Photo: తమిళ హీరో అజిత్(Thala Ajith) పక్కన చాలా సాధారణమైన కుర్రాడిలా నిల్చున్న ఆ వ్యక్తి ఎవరో గుర్తు పట్టారా..?. అతను ఆలస్యంగానే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు, కానీ నటుడిగా అతి తక్కువ సమయం లో ఇతను చూసినంత పీక్ రేంజ్ ని ఏ హీరో కూడా చూడలేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదేమో. ఇతని అద్భుతమైన నటనను చూసి నేటి తరం కమల్ హాసన్ అని అంటుంటారు. ఆ రేంజ్ పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. కేవలం హీరో పాత్రలకు మాత్రమే తనలోని నటుడ్ని ఇతను పరిమితం చేయలేదు. ఎలాంటి ఛాలెంజింగ్ రోల్ దొరికినా చేయడానికి ఇష్టపడేవాడు. ఇతన్ని చూసి మిగిలిన హీరోలు కూడా ప్రేరణ పొంది ఈమధ్య కాలం లో స్పెషల్ రోల్స్ చేస్తున్నారు. తెలుగు లో కూడా ఈ హీరో కి మంచి క్రేజ్ ఉంది. ఆయన మరెవరో కాదు, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి(Vijay Sethupathi).
Also Read: ఘాటీ ట్రైలర్ రివ్యూ…ఆ షాట్స్ ను ఆ సినిమా నుంచి కాపీ చేశారా..?
ఈయన మన తెలుగు ఆడియన్స్ కి ‘పిజ్జా’ అనే చిత్రం ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత తమిళం లో ఎన్నో కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ లో హీరో గా నటించాడు, కల్ట్ క్లాసిక్ చిత్రాలు కూడా ఈ హీరో జాబితాలో ఉన్నాయి. కెరీర్ మంచి ఊపు మీద వెళ్తున్న సమయం లోనే ఆయన ‘మాస్టర్’ చిత్రం లో విలన్ రోల్ చేయడానికి ఒప్పుకున్నాడు. ఈ సినిమాతోనే ఆయన తెలుగు లో మంచి క్రేజ్ ఏర్పడింది. హీరోని డామినేట్ చేసే విలన్ క్యారెక్టర్స్ చాలా తక్కువగా మనం చూసి ఉంటాము, అలాంటి క్యారెక్టర్స్ లో ఒకటే మాస్టర్ లో ఆయన చేసిన భావాన్ని అనే క్యారక్టర్. ఈ చిత్రం తర్వాత ఆయన ‘విక్రమ్’, ‘ఉప్పెన’, ‘జవాన్’ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో కూడా విలన్ గా నటించి మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇక గత ఏడాది ఈయన హీరో గా నటించిన ‘మహారాజా’ అనే చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో అందరికీ తెలిసిందే.
ఈ సినిమా తర్వాత ఆయన మూడు చిత్రాలు చేసాడు. అందులో నిత్యామీనన్ తో కలిసి నటించిన ‘సార్ మేడం’ అనే చిత్రం రీసెంట్ గానే తెలుగు, తమిళ భాషల్లో విడుదలై మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఈయన కొడుకు కూడా రీసెంట్ గానే హీరో గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు. మొదటి సినిమా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు కానీ, నటన పరంగా మాత్రం పర్వాలేదులే అని అనిపించే రేంజ్ లో చేసాడు. ఇక విజయ్ సేతుపతి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇండస్ట్రీ లో పైకి ఎదగాలంటే అందం, సిక్స్ ప్యాక్ బాడీ వంటివి అవసరం లేదు, కేవలం టాలెంట్ ఉంటే సరిపోతుంది అని చెప్పడానికి ఉదాహరణగా నిల్చిన నటుడు ఈయన. రాబోయే రోజుల్లో ఇంకెన్ని అద్భుతమైన క్యారెక్టర్స్ చేస్తాడో చూడాలి.