Telugu Film Direction: తెలుగు వెండితెరపై దర్శకత్వ పరంగా వచ్చిన గొప్ప చిత్రం ఏమిటి ? అనే ప్రశ్న చుట్టూ నేటి సినిమా గ్రూప్ లో ఓ చర్చ జరిగింది. ఆ చర్చలో భాగంగా చాలా సినిమాలను తమదైన పంథాలో చెప్పుకుంటూ పోయారు వర్ధమాన సినీ పక్షులు. అయితే, తెలుగులో దర్శకత్వ పరంగా వచ్చిన గొప్ప సినిమా అంటే మాత్రం.. ఠక్కున మనసులో మెదిలే సినిమా ‘సాగర సంగమం’.

వ్యక్తిగత అభిప్రాయం గురించి పక్కన పెడితే.. తెలుగులో ఆ గొప్ప సినిమా అత్యంత గొప్ప చిత్రంగా ఎలా నిలిచిందో నాలుగు ముక్కల్లో చెప్పుకోవచ్చు. సినిమా మొదటి షాట్ లోనే సినిమా ఎలా ఉండబోతుందో చెప్పేశాడు దర్శకుడు. అదే విధంగా మొదటి సన్నివేశంలోనే హీరో గురించి ఒక చెప్పుతో చాలా క్లారిటీగా చూపించారు. విసిరేసిన చెప్పు లాంటిది హీరో జీవితం అని దర్శకుడి చెప్పిన తీరు అద్భుతం.
Also Read: మీరే మా హీరో.., హేయ్.. నువ్వేంటి మేకప్ తో వచ్చావ్ !
అసలు తెలుగు సినిమా హీరో అంటే ఎలా ఉండాలి ? అలా మాత్రం ఈ సినిమా హీరో ఉండడు. బాగా నలిగిపోయిన పాత లాల్చీ వేసుకుని, ఫుల్ గా తాగేసి అటు ఇటు తూలుతూ.. మధ్యమధ్యలో కిళ్లీ నములుతూ బలం లేని చేతులతో రిక్షా నెట్టుకుంటూ రివీల్ అవుతాడు హీరో. ఈ సీన్ లో హీరో ఎలాంటి వాడు ? అసలు అతని పరిస్థితి ఏమిటి ? అనే కోణంలో చాలా చక్కగా చూపించారు.
ఇలాగే ప్రతి సన్నివేశంలో ఎంతో లోతు ఉంటుంది. సగటు ప్రేక్షకులని ఎంతగానో కదిలిస్తోంది ఈ సినిమా. కమల్ హాసన్ నటన, అలాగే ఇళయరాజా గారి సంగీతం, బాలు గారు, జానకమ్మ గొంతు ఈ సినిమా స్థాయిని పెంచాయి. కళాతపస్వి విశ్వనాధ్ గారి దర్శకత్వ పని తీరు కూడా ఈ సినిమాకు ప్రాణం పోశాయి. ఈ సినిమా అప్పట్లో సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. దక్షిణ భారతదేశంలో అన్ని భాషల్లోనూ 100 రోజులు పైగా ఆడిన మొదటి తెలుగు చిత్రం ఇదే.
Also Read: ‘ఆర్ఆర్ఆర్’లో హైలైట్ ఇంటర్వెల్ కాదు, ఆ సీక్వెన్సే !