తెలుగు తెరపై మరో వారసుడు తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. మెగా ఫ్యామిలీ కి చెందిన చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ఉప్పెన అనే చిత్రం తో హీరోగా పరిచయం అవుతున్నాడు. సుకుమార్ శిష్యుడు సానా బుచ్చిబాబుని దర్శకుడిగా పరిచయం చేస్తూ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నిత్యా శెట్టి అనే కొత్తమ్మాయి ఈ సినిమా ద్వారా కథానాయికగా పరిచయ మౌతోంది.అదలా ఉండగా ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అతను కంపోజ్ చేసిన తొలి పాట ‘నీ కన్ను నీలి సముద్రం’ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. దీనికి తోడు సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లు, ఇతర ప్రోమోలు కూడా పాజిటివ్ బజ్ తీసుకొచ్చాయి. మంచి క్వాలిటీతో తీసినట్లుగా కనిపిస్తున్న ఈ సినిమాకు రూ.20 కోట్ల దాకా బడ్జెట్ అయినట్లు తెలుస్తోంది.
కొత్త హీరో హీరోయిన్లు పైగా కొత్త దర్శకుడిని నమ్మి నిర్మాతలు ఇంత బడ్జెట్ పెట్టడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఐతే కంటెంట్ మీద నమ్మకంతో మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు రిస్క్ చేశారు. టైటిల్ పాజిటివ్ గా ఉండటమే గాక.తొలి పాట నీ కన్నులు నీలి సముద్రం సూపర్ హిట్టవడంతో ఈ సినిమాకు ట్రేడ్ వర్గాల నుంచి బిజినెస్ ఆఫర్లు బాగానే వస్తున్నట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో నైజాం ఏరియాకు ‘ఉప్పెన’ హక్కుల్ని రూ.4 కోట్లకు దిల్ రాజు కొన్నట్లు తెలిసింది.
నైజాం లో ఆ స్థాయిలో బిజినెస్ అయిందంటే.. మిగతా ఏరియాల నుంచి మంచి ఆఫర్లే వస్తాయి. ఆ లెక్కన చూస్కుంటే మొత్తం థియేట్రికల్ బిజినెస్ రూ.15 కోట్ల దాకా అయ్యే ఛాన్స్ ఉంది.ఇక డిజిటల్, శాటిలైట్ హక్కులు కూడా కలిపితే బడ్జెట్ రికవరీ కష్టమేమీ కాదు మెగా మేనల్లుడు . వైష్ణవ్ తేజ్ తొలి సారి నటిస్తున్న ఈ సినిమాకి ఈ స్థాయి బిజినెస్ జరగడం విశేషమే….కాదంటారా
Well begin is half done