స్టార్ హీరోల సరసన నటించిన హీరోయిన్ల కెరీర్ అంత త్వరగా కనుమరుగు అవ్వదు. అడపాదడపా యేవో అవకాశాలు వస్తూనే ఉంటాయి. కానీ మల్లు బ్యూటీ అను ఇమాన్యుయేల్ కి మాత్రం అదృష్టం కలిసి రాక చాలా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది.
2016 లో నాని హీరోగా నటించిన మజ్ను చిత్రంతో తెలుగు చిత్ర రంగానికి పరిచయ మైన అను ఇమ్మానుయేల్ ఆ తర్వాత అయిదు చిత్రాల్లో నటించింది.2017 లో రాజ్ తరుణ్ తో కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమా చేస్తే అది జస్ట్ యావరేజ్ గా నిలిచింది. అదే ఏడాది గోపీచంద్ హీరోగా ఆక్సీజెన్ అనే మరో చిత్రం చేస్తే అది కాస్త ఫెయిల్ అయ్యింది. ఇక 2018 లో ఏకంగా మూడు పెద్ద హీరోల చిత్రాలు చేసింది. వాటిలో మొదటిది పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అజ్ఞ్యాతవాసి కాగా అది కాస్తా ప్లాప్ అయ్యింది. ఇక ఆ వెంటనే అల్లు అర్జున్ హీరోగా వచ్చిన నా పేరు సూర్యలో నటించినా అను ఇమ్మానుయేల్ కి అదృష్టం కలిసి రాలేదు. భారీ అంచనాల నడుమ విడుదల అయినా ఈ చిత్రం ఊహించని పరాజయం పాలైంది. ఇక ఆ ఏడాది చివర్లో నాగ చైతన్య తో కలిసి నటించిన శైలజ రెడ్డి అల్లుడు కూడా ప్లాప్ అవడంతో ఇక ఆమెకి ఐరన్ లెగ్ ముద్ర వేసేసి తెలుగు నిర్మాతలు పక్కన పెట్టేసారు.
ఈ గ్యాప్ లోఅను ఇమ్మానుయేల్ స్లిమ్ అయి మునుపటి కంటే చాల గ్లామరస్ గా కనిపిస్తున్నప్పటికీ పెద్ద హీరోల సినిమాల్లో అయితే ఛాన్సులు రావడం లేదు. ఇప్పుడామె అల్లు అర్జున్ తమ్ముడు శిరీష్ సరసన ఒక చిత్రంలో నటించనుంది. అవడానికి అల్లు శిరీష్ మెగా హీరోల్లో ఒకడైనా కానీ చెప్పుకోతగ్గ మార్కెట్ లేదు. అయిదు కోట్ల మార్కెట్ ఉన్న హీరో అతను. అలా టాప్ హీరోలతో నటించిన అను ఇమ్మానుయేల్ దురదృష్టానికి చిరునామాగా మారింది.
Luck is bigger than glamour and talent