
సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం ‘సర్కారువారిపాట’. సీనియర్ హీరో కృష్ణ జన్మదినం సందర్భంగా ‘సర్కారువారిపాట’ సినిమా ప్రారంభమైంది. అదేరోజు ఈ సినిమాకు సంబంధించిన ఫస్టు లుక్ రిలీజ్ చేసి అభిమానుల్లో జోష్ నింపారు. నేటివరకు కూడా ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కాకపోవడంతో ఫ్యాన్స్ నిరుత్సాహం చెందుతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
తాజాగా సర్కారువారిపాట మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభమైనట్లు సంగీత దర్శకుడు తమన్ ట్వీట్ చేశాడు. ‘తాజాగా సర్కారువారిపాటకు సంబంధించి అద్భుతమైన మ్యూజిక్ కంపోజింగ్ జరిగాయి. మహేష్ గారికి మంచి పాటలు అందించేందుకు వీలుగా అద్భుతమైన సన్నివేశాలను సృష్టించిన డార్లింగ్ డైరెక్టర్ పరశురామ్‌కు ధన్యవాదాలు.. నిర్మాతలకు కృతజ్ఞతలు’ అంటూ తమన్ ట్వీట్ చేశాడు.
Also Read: షాకింగ్ : వేణు మాధవ్ మృతికి పాలిటిక్స్ కారణమా?
తమన్ ట్వీట్ తో ‘సర్కారువారుపాట’ షూటింగ్ పట్టాలెక్కడం ఖాయంగా తేలింది. కరోనా కారణంగా ఈమూవీ షూటింగ్ ఆలస్యం అవుతుండటంతో సినిమా ఆగిపోయిందనే టాక్ విన్పించింది. కథ రీత్య మూవీ షూటింగ్ అమెరికాలో చేయాల్సి ఉండగా యూనిట్ సభ్యులకు వీసాలో సమస్యలు రావడంతో సినిమా మరో రెండు నెలలు వాయిదా పడినట్లు సమాచారం.
Also Read: పెళ్లికి రెడీ అయిన యాంకర్ రష్మి.. ఏమందంటే?
ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు త్రివిక్రమ్ తో ఓ మూవీ ప్లాన్ చేశాడనే వార్తలు విన్పించాయి. ఈ మూవీ షూటింగును ఇండియాలోనే ప్రారంభించేందుకు దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడు. నవంబర్లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుందనే టాక్ విన్పిస్తోంది. తాజాగా తమన్ మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయి. మహేష్ కంటే ముందే తమన్ ‘పాట’ పాడుతుండటంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.