Rajamouli – Mahesh Movie : ఒక సినిమాని తీసి దానిని సక్సెస్ చేయాలంటే అందులో దర్శకుడి పాత్ర చాలా కీలకమనే చెప్పాలి. ఇక ఇలాంటి క్రమంలో ఇండియాలోనే ఎవరికి సాధ్యం కానీ రీతిలో వరుస సినిమాలను చేస్తూ మంచి విజయాలను అందుకుంటున్న ఏకైక దర్శకుడు రాజమౌళి. ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో ఒక పెను సంచలనాన్ని సృష్టిస్తుంది అంటే మామూలు విషయం కాదు.
ఆయనకి సినిమా తప్ప ఏమి తెలియదు దానికోసం ఎంతైనా కష్టపడతాడు అనేది మాత్రం వాస్తవం. అందుకే ఆయనకి ఇప్పటి వరకు ఒక్క ఫెయిల్యూర్ కూడా లేదు. వరుస సినిమాలను సక్సెస్ చేస్తూ అదే సక్సెస్ ట్రాక్ ని అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ చేస్తు వస్తున్నాడు.
ఇక ఎన్టీయార్, రామ్ చరణ్ లతో చేసిన త్రిబుల్ ఆర్ సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్న ఆయన ప్రస్తుతం మహేష్ బాబు తో ఒక పాన్ వరల్డ్ సినిమాని చేస్తున్నాడు. అయితే ఈ సినిమా కోసం మహేష్ బాబు ని ఫుల్ ఫ్లెడ్జ్ డ్ గా వాడుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
అయితే అందులో భాగంగానే ఈ సినిమాలో కొన్ని సీన్లలలో మహేష్ బాబు చాలా క్రుయాల్ గా కూడా నటించాల్సిన అవసరమైతే ఉంటుందట. ఇక అలాంటి సమయంలో సాఫ్ట్ గా కనిపించే మహేష్ బాబుని అంత క్రుయాల్ గాఎలా చూపిస్తాడు అంటూ కొంతమంది అభిమానులు వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక రాజమౌళి తలుచుకుంటే ఎవరిని ఎలాగైనా చూపిస్తాడు అంటూ మరి కొంత మంది సినీ మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి ఈ పాత్రను చాలా వైల్డ్ గా చూపించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక చాక్లెట్ బాయ్ లా కనిపించే మహేష్ బాబు ఇలాంటి ఒక పాత్రని ఎంతవరకు పోషిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.కానీ రాజమౌళి చేతిలో పడ్డ తర్వాత నటులు ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ అయిన పలికించాల్సిందే అంటూ మరికొందరు ఈ విషయం మీద సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు… ఇక తొందర్లోనే ఈ సినిమా సెట్స్ మీదికి తీసుకెళ్లి చాలా ఫాస్ట్ గా షూటింగ్ కంప్లీట్ చేసి అంతే తొందరగా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది…