https://oktelugu.com/

అదే హీరో నాని సినిమాలు ఆడకపోవడానికి కారణమా?

ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు కావడమంటే ఇదేనేమో.. 2017 సంవత్సరం ఆసాంతం .. ఆ ఒక్క ఏడాది 6 సినిమాలు హిట్ ఇచ్చిన నాని.. 2018 సంవత్సరం వచ్చేసరికి ఫ్లాప్ తెచ్చుకున్నాడు.  గడిచిన ఏడాదిగా హీరో నాని సరైన హిట్ కరువవుతోంది… నాని ఎంచుకుంటే సినిమా పక్కా హిట్ అన్న టాక్ ఉండేది. ఎవడే సుబ్రహ్మణ్యం నుంచి ఎంసీఏ వరకు నాని రేంజ్ పెంచుకుంటూ వచ్చాయి ఆయా సినిమాలు. ఆ తరువాత  వచ్చిన కృష్ణార్జున యుద్ధం మాత్రం […]

Written By:
  • NARESH
  • , Updated On : October 1, 2020 / 01:34 PM IST
    Follow us on


    ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు కావడమంటే ఇదేనేమో.. 2017 సంవత్సరం ఆసాంతం .. ఆ ఒక్క ఏడాది 6 సినిమాలు హిట్ ఇచ్చిన నాని.. 2018 సంవత్సరం వచ్చేసరికి ఫ్లాప్ తెచ్చుకున్నాడు.  గడిచిన ఏడాదిగా హీరో నాని సరైన హిట్ కరువవుతోంది… నాని ఎంచుకుంటే సినిమా పక్కా హిట్ అన్న టాక్ ఉండేది. ఎవడే సుబ్రహ్మణ్యం నుంచి ఎంసీఏ వరకు నాని రేంజ్ పెంచుకుంటూ వచ్చాయి ఆయా సినిమాలు. ఆ తరువాత  వచ్చిన కృష్ణార్జున యుద్ధం మాత్రం నిరాశపరిచింది. అప్పటి నుంచి హీరో నాని సక్సెస్ మేనియా కొనసాగుతుంది అనుకున్న వారికి షాక్ తగిలింది..

    Also Read: తమన్నా కెరీర్ లోనే ఇది భారీ రెమ్యున‌రేష‌న్‌ !

    తనకు కలిసివచ్చిన లవర్ బాయ్, నేచురల్ అబ్బాయిల కథలకే నాని మొగ్గుచూపుతున్నట్టు తెలిసింది. మాస్ కమర్షియల్ హంగులతో తీసిన ‘వి’ మూవీ ఆశించిన విజయం దక్కించుకోలేకపోవడంతో నాని తన కొత్త సినిమాల విషయంలో ఇక ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని యోచిస్తున్నాడట..  ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ ప్రయోగాత్మక చిత్రం చేయవద్దని నాని డిసైడ్ అయినట్టు తెలిసింది.

    నిజానికి ‘వి’ సినిమాలో నెగెటివ్ రోల్ హీరో నాని ప్రయోగం చేశాడు. తన సహజశైలికి భిన్నంగా మాస్ పాత్రను పోషించాడు.    ఇదివరకు నాని నుంచి వచ్చిన సినిమాలన్నీ మంచి క్లాస్ మూవీస్.. అయితే దానికి భిన్నంగా నాని కాస్త మాస్ టచ్ చేస్తూ తీసిన సినిమా వి. ఈ సినిమా ద్వారా నాని మళ్లీ రెండేళ్లు వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలానే మరో ఫ్లాప్ పడితే నాని సీన్ మళ్లీ రిపీట్ అయ్యే అవకాశాలున్నా యంటున్నారు సినీ పండితులు..

    Also Read: థియేటర్ల ఓపెనింగ్.. కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ అవుతుందా?

    నిజానికి నానిపై ప్రేక్షకుల్లో నెగెటివ్ ఇంపాక్ట్ పడడానికి ప్రధాన కారణం ‘బిగ్ బాస్’ అంటున్నారు. బిగ్ బాస్ వ్యాఖ్యాతగా మారాకే నాని సినిమాలు ఫ్లాప్ అవుతూ ఆయనపై అభిమానుల్లో ఓరకమైన ఇమేజ్ పడిపోవడానికి కారణమైందన్న అపవాదు ఇండస్ట్రీలో ఉందట..