Sandeep Reddy Vanga: అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ… ఆయన చేసిన సినిమాలన్నీ అతనికి గొప్ప విజయాలను సాధించి పెట్టాయి. ఇప్పటివరకు మూడు సినిమాల చేసినప్పటికి అవి మూడు కూడా తనకు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించి పెట్టడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ప్రస్తుతం ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాడు… సందీప్ రెడ్డి వంగ అంటే ఇండియాలో ఒక స్వాగ్ అయితే ఉంటుంది. తనతో మాట్లాడడానికైనా తన సినిమాలో నటించడానికైన చాలామంది చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తూ ఉంటారు.
ఎందుకంటే సందీప్ చాలా అగ్రేసీవ్ గా ఉంటాడు. ఎవరు ఏమైనా మాట్లాడినా కూడా దానికి కౌంటర్లు అయితే ఇస్తూ ఉంటాడు. అతని సినిమాల్లో నటించడానికి నటీనటులకు కావాల్సిన రిఫరెన్స్ లను ఇస్తు వాళ్ల చేత నటింప చేయించుకోవడానికి తన ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు… తను షూట్ చేసే సీన్ పట్ల పూర్తి క్లారిటీతో ఉంటాడు.
ఒకరకంగా చెప్పాలంటే టాలీవుడ్ లో గానీ ఇండియన్ ఇండస్ట్రీలో గానీ మిగతా దర్శకుల కంటే సందీప్ రెడ్డి వంగ స్పెషల్…ఎందుకంటే తనకి సినిమా మీదున్న ఇష్టాన్ని అలాగే తన బిహేవియర్ ను బట్టి తను ఇతర దర్శకుల కంటే స్పెషల్ గా చెప్పవచ్చు. ఇక ఏదేమైనా కూడా ఇప్పుడు ప్రభాస్ తో చేస్తున్న సినిమాతో రెండు వేల కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబడతానని ప్రభాస్ అభిమానులకైతే మాటిచ్చాడు…
ఇక ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తుందా? తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోగలుగుతాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…మొత్తానికైతే సందీప్ రెడ్డి వంగ చేసే సినిమాలతో భారీ విజయాలను సాధించి ఇండియన్ సినిక ఇండస్ట్రీ లోనే ఆయన టాప్ డైరెక్టర్ గా ఎదుగుతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…