https://oktelugu.com/

తొలి ఆంధ్రా న్యూస్ ఛానల్ ఎందుకు మూసివేయాల్సి వచ్చిందంటే?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా ఏర్పడింది. తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళుతుంటే ఏపీ మాత్రం చతికిలపడుతుంది. గత ఆరేళ్లలో కనీసం రాజధాని కూడా నిర్మించుకోలేని దుస్థితిలోకి వెళ్లిందంటే ఏపీ పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా అక్కడ వెలిసిన న్యూస్ ఛానళ్లు తిరిగి హైదరాబాద్ కేంద్రంగా నడిపేందుకు సిద్ధమవుతుండటం చర్చనీయాంశంగా మారింది. Also Read: స్వరూపానందకు ఆ ‘మర్యాద’ చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో అమరావతిని రాజధానిగా ప్రకటించి నవ్యాంధ్రను నిర్మిస్తానని ప్రకటించాడు. అయితే […]

Written By:
  • NARESH
  • , Updated On : November 22, 2020 / 04:06 PM IST
    Follow us on

    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా ఏర్పడింది. తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళుతుంటే ఏపీ మాత్రం చతికిలపడుతుంది. గత ఆరేళ్లలో కనీసం రాజధాని కూడా నిర్మించుకోలేని దుస్థితిలోకి వెళ్లిందంటే ఏపీ పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా అక్కడ వెలిసిన న్యూస్ ఛానళ్లు తిరిగి హైదరాబాద్ కేంద్రంగా నడిపేందుకు సిద్ధమవుతుండటం చర్చనీయాంశంగా మారింది.

    Also Read: స్వరూపానందకు ఆ ‘మర్యాద’

    చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో అమరావతిని రాజధానిగా ప్రకటించి నవ్యాంధ్రను నిర్మిస్తానని ప్రకటించాడు. అయితే ఆయన మాటలు కోటలు దాటయే తప్ప రాజధాని నిర్మాణం పూర్తికాలేదు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక ఏపీకి మూడు రాజధానులను ప్రకటించాడు. దీంతో ఐదేళ్లలో రాజధాని కోసం ఖర్చు చేసిన వేల కోట్లు వృథాగా మారాయి.

    సీఎం జగన్ నిర్ణయం తీసుకున్న మూడు రాజధానుల నిర్మాణం కూడా ఎక్కడా ముందుకెళ్లడం లేదు. దీంతో ఏపీలో రాజధానే పెద్ద సమస్యగా మారింది. ఏపీ నూతన రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కొన్ని మీడియా సంస్థలు ఏపీ కేంద్రంగా వెలిశాయి. వీటిలో ఏపీ 24/7 న్యూస్ ఛానల్ విజయవాడ కేంద్రంగా ఏర్పాటైంది. ఆంధ్రప్రదేశ్ లో స్థిరపడిన తొలి న్యూస్ ఛానల్ గా పేరు సంపాదించుకుంది.

    ఏపీ 24/7 న్యూస్ ఛానల్ ను మా టీవీ మాజీ అధినేత మురళీకృష్ణంరాజు చైర్మన్ కొంతమందితో కలిసి పెట్టారు. ఏపీ ప్రజలు ఓన్ చేసుకునేంత స్టఫ్ లేకపోయినా విజయవాడ కేంద్రంగా మీడియా రంగం స్థిరపడటానికి అవకాశం ఏర్పడింది. అయితే గత నాలుగు నెలలుగా సిబ్బందికి జీతాలు ఇవ్వకపోవడంతో వారు ధర్నాకు దిగారు. ఈనేపథ్యంలోనే యాజమాన్యం ఆ ఛానల్ ను మూసివేసేందుకు నిర్ణయం తీసుకుంది.

    Also Read: ఎంఐఎం చరిత్ర ఏంటి? జాతీయ పార్టీగా ఎలా ఎదిగింది?

    ఛానల్ మూసివేతకు ఉద్యోగుల మధ్య ఆధిపత్య పోరుకుతోడు రాజధాని సమస్య కూడా కారణమని తెలుస్తోంది. ఈ ఛానల్ ను వైసీపీ నేతలు తీసుకున్నారని.. మంచి రోజులు వచ్చాయని అనుకున్న తరుణంలో యాజమాన్యం ఛానల్ మూసివేతకు నిర్ణయం తీసుకోవడం షాకింగ్ కు గురిచేస్తోంది. ఏపీ ప్రజలు ఇప్పటికీ కూడా చదువులు, ఉద్యోగాలు.. వైద్య సేవల కోసం ఇంకా పొరుగు రాష్ట్రాలపైనే ఆధారపడుతున్నారు. ఏపీ 24/7 ఛానల్ మూసివేతతో ఇక మీడియా సైతం హైదరాబాద్ కేంద్రంగానే సేవలందించనుందని అర్థమవుతోంది. ఇలా ఎన్నిరోజులో మరీ..!

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్