https://oktelugu.com/

‘దుబ్బాక’ ప్రచారం ఎవరు ముందున్నారంటే?

తెలంగాణలోని దుబ్బాక నియోజకవర్గంలో జరుగుతున్న ఉప ఎన్నిక పోరు రతవత్తర స్థాయికి చేరింది. మరి కొద్దిరోజుల్లోనే ఉప ఎన్నిక ఉండడంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచార జోరును పెంచాయి. అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ తరుపున సోలిపేట రామలింగారెడ్డి కుటుంబానికే టికెట్‌ రావడంతో సింపతితోనే మళ్లీ టీఆర్‌ఎస్‌ను గెలిపించే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకులు ప్రచారం చేస్తున్నాయి. రెండు, మూడు సార్లు ఓడిపోయిన రఘునందన్‌రావు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి.. అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని కోరుతున్నాడు. […]

Written By:
  • NARESH
  • , Updated On : October 21, 2020 / 09:58 AM IST
    Follow us on

    dubbaka

    తెలంగాణలోని దుబ్బాక నియోజకవర్గంలో జరుగుతున్న ఉప ఎన్నిక పోరు రతవత్తర స్థాయికి చేరింది. మరి కొద్దిరోజుల్లోనే ఉప ఎన్నిక ఉండడంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచార జోరును పెంచాయి. అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ తరుపున సోలిపేట రామలింగారెడ్డి కుటుంబానికే టికెట్‌ రావడంతో సింపతితోనే మళ్లీ టీఆర్‌ఎస్‌ను గెలిపించే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకులు ప్రచారం చేస్తున్నాయి. రెండు, మూడు సార్లు ఓడిపోయిన రఘునందన్‌రావు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి.. అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని కోరుతున్నాడు. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ సైతం బడా నాయకులతో ప్రచారాన్ని ఉధృతం చేస్తోంది.

    Also Read: మోడితో కయ్యమే ‘కాళేశ్వరం’కు బ్రేకులా..!

    టీఆర్‌ఎస్‌, బీజేపీలు రెండూ సింపతి అనే అంశం మీద ఎక్కువగా ఫోకస్‌ చేస్తున్నాయి. సిట్టింగ్‌ ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతి చెందడంతో ఆయన సతీమణికే టిక్కెట్‌ ఇవ్వడంతో మరోసారి ఆమెకే ప్రజలు అవకాశం ఇస్తారని టీఆర్‌ఎస్‌ నాయకులు భావిస్తున్నారు. దీంతో పాటు అధికారంలో ఉన్న పార్టీ కనుక ఎంతో కొంత అభివృద్ధికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఇక ఈ నియోజకవర్గంలో గెలిస్తే వచ్చే గ్రేటర్‌ ఎన్నికలపై ప్రభావం ఉంటుందనే ప్రభావంతో ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు.

    బీజేపీ నుంచి మూడుసార్లు ఓటమి చెందిన రఘునందన్‌రావు ఈసారి అవకాశం ఇస్తారని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. సోషల్‌ మీడియాల్లో ఇప్పటికే టీఆర్‌ఎస్‌పై వ్యతిరేకతతో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కనుక కేంద్ర ప్రభుత్వ పథకాలు వినియోగించుకోవచ్చని ఆ పార్టీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఇక ఇన్నేళ్లలో సిద్ధిపేట, గజ్వేల్‌ను అభివృద్ధి చేసిన టీఆర్‌ఎస్‌ అధిష్టానం దుబ్బాకను పట్టించుకోలేదని, మళ్లీ గెలిపిస్తే అదే గతి పడుతుందని అంటున్నారు. మరోవైపు బీజేపీకి దుబ్బాకలో గెలిస్తే గ్రేటర్‌లో కొన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంటుందని పార్టీ నాయకులు ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు.

    Also Read: మోడీ ప్రసంగం.. వరాలు లేవు.. కేవలం కరోనా హెచ్చరికే

    ప్రచారంలో టీఆర్‌ఎస్‌, బీజేపీలే ముందున్నాయని అంటున్నా కాంగ్రెస్‌ సైతం ఈ నియోజకవర్గంలో గెలుస్తామనే నమ్మకంతోనే ముందుకు వెళ్తోంది. ఇన్నాళ్లు చెరుకు ముత్యంరెడ్డితోనే  సోలిపేట రామలింగారెడ్డికి బలం ఉండేదని ఇప్పుడు ముత్యంరెడ్డి కుటుంబం టీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌ తరుపున బరిలో ఉన్నారంటే టీఆర్‌ఎస్‌లో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చంటూ కాంగ్రెస్‌ నాయకులు చెబుతున్నారు. మరోవైపు చెరుకు ముత్యంరెడ్డి కుటుంబానికి ప్రజల్లో మంచి పేరుందని కచ్చితంగా ఇది లాభిస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది.

    మొత్తంగా మూడు పార్టీలు మూడు రకాలుగా విశ్లేషణలు చేసుకుంటున్నాయి. అంతిమ విజయం ఎవరిదనేది ఆసక్తిగా మారింది.