Okkadu movie : ఒక్కడు మూవీలో ధర్మవరపు సుబ్రమణ్యం చెప్పిన ఫోన్ నెంబర్ 98480… ఎవరిదో తెలుసా?

Okkadu movie  : మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా ఉంది ఒక్కడు. 2003లో విడుదలైన ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ టాలీవుడ్ రికార్డ్స్ బద్దలు కొట్టింది. దర్శకుడు గుణశేఖర్ రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ కి హైదరాబాద్ యువకుడికి ఓ అమ్మాయి విషయంలో చిచ్చుపెట్టి కథ భలే నడిపారు. ఒక ఇంటెన్స్ యాక్షన్ డ్రామాలో అంతర్లీనంగా నడిచే లవ్ స్టోరీ యూత్ కి తెగ నచ్చేసింది. మహేష్ కి ఒక్కడు మూవీతో విపరీతమైన ఇమేజ్ వచ్చింది. […]

Written By: NARESH, Updated On : January 23, 2023 8:35 pm
Follow us on

Okkadu movie  : మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా ఉంది ఒక్కడు. 2003లో విడుదలైన ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ టాలీవుడ్ రికార్డ్స్ బద్దలు కొట్టింది. దర్శకుడు గుణశేఖర్ రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ కి హైదరాబాద్ యువకుడికి ఓ అమ్మాయి విషయంలో చిచ్చుపెట్టి కథ భలే నడిపారు. ఒక ఇంటెన్స్ యాక్షన్ డ్రామాలో అంతర్లీనంగా నడిచే లవ్ స్టోరీ యూత్ కి తెగ నచ్చేసింది. మహేష్ కి ఒక్కడు మూవీతో విపరీతమైన ఇమేజ్ వచ్చింది. మణిశర్మ సాంగ్స్ అద్భుతం. భూమిక గ్లామర్ గురించి ఎంత చెప్పినా తక్కువే.

ఈ మూవీ నిర్మాత ఎం ఎస్ రాజు కోట్లు కొల్లగొట్టారు. అదే సమయంలో చిన్నపాటి సమస్యలో కూడా ఇరుక్కున్నారు. కథలో భాగంగా ఒక్కడు కోసం గుణశేఖర్ ఓ కామెడీ ట్రాక్ రాసుకున్నారు. విలన్ ప్రకాష్ రాజ్ నుండి భూమికను కాపాడటం కోసం విదేశాలకు పంపాలనేది హీరో ప్లాన్. పాస్ పోర్ట్ కూడా అప్లై చేస్తారు. పాస్ పోర్ట్ ఏమో రూల్స్ ప్రకారం ఇంటి అడ్రస్ కి వెళుతుంది. అలా అయితే భూమిక కర్నూల్ పోవాల్సి ఉంటుంది. కర్నూల్ పోతే ప్రకాష్ రాజ్ బంధించి పెళ్లి చేసుకుంటాడు. కాబట్టి పాస్ పోర్ట్ ఆఫీస్ కి వెళ్లి భూమిక పాస్పోర్ట్ తీసుకోవాలని మహేష్ ప్లాన్ చేస్తాడు.

పాస్ పోర్ట్ ఆఫీసర్ అయిన ధర్మవరపు సుబ్రమణ్యానికి లంచం ఇచ్చి పాస్ పోర్ట్ తీసుకోవాలి అనుకుంటాడు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం లంచానికి లొంగడు. ఎలాగైనా పాస్ పోర్ట్ రాబట్టాలని నిర్ణయించుకున్న మహేష్ తన ఫ్రెండ్స్ తో సుబ్రమణ్యంని ఓ ఆటాడుకుంటాడు. కొత్తగా సెల్ ఫోన్ కొన్న సుబ్రహ్మణ్యం… ప్రేయసికి కాల్ చేసి ఫోన్ నెంబర్ చెప్పి ముందుగా నువ్వే కాల్ చేయాలని చెబుతాడు. తన నెంబర్ గా 98480 23919 అని మెలికలు తిరుగుతూ చెబుతారు. భూమిక పాస్పోర్ట్ కోసం వెళ్లిన మహేష్ గ్యాంగ్ ఆ నెంబర్ మైండ్ లో పెట్టుకొని… ఫోన్లు చేసి విసిగిస్తారు.

ప్రేయసి ఫోన్ కోసం ఎదురుచూస్తున్న సుబ్రహ్మణ్యంకి వరుసగా రాంగ్ కాల్స్ వస్తాయి. రాంగ్ కాల్స్ తో విసిగిపోయిన సుబ్రమణ్యం కొత్త సెల్ ఫోన్ పగలగొడతాడు. తిక్కలో ఉన్న సుబ్రహ్మణ్యం పాస్పోర్ట్ చేతికి ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. మహేష్ ప్లాన్ ఫలిస్తుంది. కాగా ఆ సీన్ లో సుబ్రమణ్యం చెప్పిన ఫోన్ నెంబర్ నిర్మాత ఎం ఎస్ రాజుది అట. సినిమా చూసిన చాలా మంది ఆ నెంబర్ నోట్ చేసుకొని మరీ ఫోన్స్ చేసేవారట. దీంతో వందల్లో ఎం ఎస్ రాజుకు రాంగ్ కాల్స్ వచ్చాయట. ఇక చేసేది లేక నెంబర్ మార్చుకున్నారట.