https://oktelugu.com/

రాజాధిరాజా: జగన్‌ ఆస్థానంలో రాజగురువు!?

గతంలో ఎన్టీఆర్‌‌ సీఎంగా ఉన్నప్పుడు పెద్దగా ఎవరి మాట లెక్క చేసే వారు కాదు. హిందూ సంప్రదాయాల పట్ల నమ్మకం ఉన్నా.. పెద్దగా ఏ స్వామిజీని ప్రోత్సహించేవారు కాదు. అందుకే ఎవరూ తన గురువు అని ఎక్కడా అంగీకరించలేదు. ఇక ఆ తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి కావడానికి ఓ మీడియా అధిపతి సహకరించారని ప్రచారంలో ఉంది. దాంతో ఆయన్ని బాబుకు రాజగురువుగా పేర్కొంటుంటారు. ఈ రాజగురువు అక్షర యాగాలే చేస్తారు. ఆయన తన పాఠకులకే టీడీపీ అనుకూల […]

Written By:
  • NARESH
  • , Updated On : November 16, 2020 / 08:16 AM IST
    Follow us on

    గతంలో ఎన్టీఆర్‌‌ సీఎంగా ఉన్నప్పుడు పెద్దగా ఎవరి మాట లెక్క చేసే వారు కాదు. హిందూ సంప్రదాయాల పట్ల నమ్మకం ఉన్నా.. పెద్దగా ఏ స్వామిజీని ప్రోత్సహించేవారు కాదు. అందుకే ఎవరూ తన గురువు అని ఎక్కడా అంగీకరించలేదు. ఇక ఆ తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి కావడానికి ఓ మీడియా అధిపతి సహకరించారని ప్రచారంలో ఉంది. దాంతో ఆయన్ని బాబుకు రాజగురువుగా పేర్కొంటుంటారు. ఈ రాజగురువు అక్షర యాగాలే చేస్తారు. ఆయన తన పాఠకులకే టీడీపీ అనుకూల స్తోత్ర పాఠాలు వల్లించి చంద్రబాబుకు మేలు జరిగేలా చూస్తారని అందరూ అంటుంటారు.

    Also Read: దోస్తీకి చెక్: జగన్ తో ఫైట్ కు ఓవైసీ రెడీ? కారణమదే!

    ఇక ఇప్పటి సీఎం జగన్‌.. స్వతహాగా క్రిస్టియన్ గా చెబుతుంటారు‌. ఆయనకు హిందూ సంప్రదాయాల పట్ల ఏ విధమైన అభిప్రాయాలు మొదట్లో లేవు. అందుకే 2014 ఎన్నికల్లో విశాఖకు చెందిన స్వరూపానందేంద్ర స్వామి జగన్‌ అధికారంలోకి రాకూడదని భావించారట. కానీ.. ఇప్పుడు చిత్రంగా ఇద్దరికీ బంధం కుదిరింది. దానికి బీజం వేసింది మాజీ ఎంపీ టీ.సుబ్బరామిరెడ్డి అని చెబుతుంటారు. అయితే ఇప్పుడు టీఎస్సార్ సైడ్ అయినా.. ఆ స్వామి పట్ల జగన్‌కి మాత్రం మంచి బాండింగ్‌ కుదిరింది. అది ఎంతలా అంటే జగన్ ఏ మంచి పని తలపెట్టాలన్నా ఆయన జాతకం, ముహూర్తం చూసి చెప్పాల్సిందేనట.

    ఇలా గతంలో ఎప్పుడూ జరగలేదు. పీఠాధిపతులు, స్వామిజీలు వస్తే వారికి ఎన్నడూ రాచమర్యాదలు చేసిన దాఖలాలు లేవు. కేవలం వీవీఐపీలుగా భావించి ఆలయాల్లో స్వాగతం పలుకుతుంటారు. కానీ.. జగన్‌ జమానాలో మాత్రం ఓ స్వామిజీకి ఏకంగా ఎర్ర బుగ్గ కారు సదుపాయం కల్పించారు. ఇక స్వామి తిరుపతి వస్తే ఏకంగా విమానాశ్రయం నుంచి ఎదురేగి టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. ఇప్పుడు ఆయన పుట్టిన రోజున అన్ని దేవాలయాల్లోనూ అర్చనలు జరిపించాలని జీవోలు ఇచ్చారు. మొత్తానికి స్వామిజీ అంటే జగన్ కి ఎంత మక్కువ అన్నది వీటితో రుజువైంది.

    Also Read: ఏపీకి కొత్త సీఎం.. ‘ఆర్ఆర్ఆర్’ సంచలన కామెంట్స్..!

    కానీ.. ఈ నిర్ణయాలే వివాదాలుగా మారాయి. జగన్‌కు జనవరి తరువాత మంచి రోజులు అని స్వామి చెబుతున్నట్లుగా ప్రచారంలో ఉంది. డిసెంబర్ వరకూ ఆయన అనుకున్న దానికి ఆటంకాలు ఏర్పడుతాయని కూడా చెబుతున్నారు. ఈ పరీక్ష సమయంలో జగన్ నెగ్గితే ఆయనకు తిరుగులేదని కూడా అంటున్నారు. దాంతో స్వామిజీ పై గురి మరింత పెంచుకున్న జగన్ ఆస్థాన రాజ గురువుగా చోటు కల్పించారని అంటున్నారు. గతంలో ఆస్థాన గాయకులు, కవి పండితులు ఉండేవారు. తాజాగా.. రాజ గురువులు కూడా చేరబోతున్నారన్నమాట.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్