నిరుద్యోగులకు ఎస్బీఐ శుభవార్త.. రూ.27000 వేతనంతో ఉద్యోగాలు..?

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ప్రొబెషనరీ ఆఫీసర్స్ ఉద్యోగాల కొరకు ఎస్బీఐ నిరుద్యోగుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈ ఉద్యోగాలకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే పీవో ఉద్యోగాల కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా డిసెంబర్ 4 దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు 27,620 రూపాయలు వేతనంగా లభిస్తుంది. అయితే ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లు […]

Written By: Navya, Updated On : November 15, 2020 8:10 pm
Follow us on


దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ప్రొబెషనరీ ఆఫీసర్స్ ఉద్యోగాల కొరకు ఎస్బీఐ నిరుద్యోగుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈ ఉద్యోగాలకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే పీవో ఉద్యోగాల కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా డిసెంబర్ 4 దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు 27,620 రూపాయలు వేతనంగా లభిస్తుంది.

అయితే ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లు రెండు సంవత్సరాలు తప్పనిసరిగా బ్యాంకులో పని చేయాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఫైనల్ ఇంటర్వ్యూ రౌండ్ల ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

డిగ్రీ పూర్తి చేసిన వాళ్లు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 2,000 ఉద్యోగ ఖాళీలు ఉండగా డిసెంబర్ 31 జనవరి 2, 4, 5 తేదీలలో ప్రిలిమ్స్ పరీక్ష ఉంటుంది. జనవరి నెల 29వ తేదీన మెయిన్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు ఫీజును చెల్లించాల్సిన అవసరం లేదు. ఓబీసీ, జనరల్ కేటగిరీ అభ్యర్థులు మాత్రం 750 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

అయితే ఈ ఉద్యోగాలకు పోటీ తీవ్రంగా ఉంటుంది. ఎవరైతే కష్టపడి ప్రిపేర్ అవుతారో వాళ్లు మాత్రమే ఈ ఉద్యోగాలకు ఎంపికయ్యే అవకాశం ఉంటుంది.