Jagapathi Babu and Kalyani : తెలుగు సినిమా ఇండస్ట్రీలో జగపతిబాబు అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. ఎందుకంటే ఆయన ఫ్యామిలీ మెన్ గా చాలా సినిమాలు చేసి అప్పట్లో ఫ్యామిలీ ఆడియన్స్ ని విపరీతంగా అలరించాడు. అలాంటి జగపతిబాబు చేసిన వరుస సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను అందుకున్నాయి. అందులో భాగంగానే ఆయన వరుస సినిమాలతో ఇండస్ట్రీలో సక్సెస్ లను కూడా అందుకున్నాడు.
ఇక ఇలాంటి క్రమంలో జగపతిబాబు తన కెరియర్ లో చాలామంది హీరోయిన్లతో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు ఇక అందులో భాగంగానే ఆయన హీరోయిన్ కళ్యాణి తో చాలా ఎక్కువ సినిమాల్లో నటించి వీళ్ళిద్దరి కాంబినేషన్ ని బెస్ట్ కాంబినేషన్ గా మార్చుకున్నారు. ఈ కాంబోలో వచ్చిన మొదటి సినిమా పరుచూరి మురళి డైరెక్షన్ లో వచ్చిన పెదబాబు సినిమా కావడం విశేషం…ఇక వీరిద్దరి మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చాలా బాగా ఉండడంతో వరుసగా కబడ్డీ కబడ్డీ ,పందెం లాంటి మరికొన్ని సినిమాల్లో వీళ్ళు కలిసి నటించి ప్రేక్షకులను సైతం విశేషంగా అలరించారు.ఇక గోపిచంద్ హీరోగా వచ్చిన లక్ష్యం సినిమాలో కూడా వీరిద్దరూ భార్య భర్తలు గా నటించారు.
ఇక అలాగే బోయపాటి తీసిన లెజెండ్ సినిమాలో కూడా వీళ్ళిద్దరి కాంబో నే మరోసారి రిపీట్ అయింది.అయితే అప్పట్లో చాలామంది వీళ్లిద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉందనే అభిప్రాయాలు వ్యక్తం చేశారు. నిజానికి వీళ్ళిద్దరూ కొద్దిరోజులు రిలేషన్ లో ఉన్నారని వార్తలు కూడా వచ్చాయి. అయితే అవన్నీ అబద్ధాలు అంటూ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో జగపతిబాబు దానికి సంబంధించిన క్లారిటీని ఇచ్చారు.ఇక ఇదే క్రమం లో సత్యం సినిమా తో డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న సూర్య కిరణ్ ఆ తర్వాత డైరెక్టర్ గా కొన్ని సినిమాలు చేశాడు. అయితే కళ్యాణి సూర్య కిరణ్ ని పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయింది.దాంతో సూర్య కిరణ్ తెలుగు లో కొన్ని సినిమాలు చేసినప్పటికీ అవి పెద్దగా వర్కౌట్ అవ్వలేదు.
దాంతో వీళ్ళిద్దరి మధ్య గొడవలు రావడంతో వీళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారనే వార్తలు అప్పట్లో చాలా సంచలనాన్ని సృష్టించాయి.ఇక ఇదిలా ఉంటే మరి కొందరు మాత్రం జగపతిబాబు కి , కళ్యాణి కి మధ్య మంచి రిలేషన్ షిప్ ఉండడంతో వాళ్ళ వ్యవహారం సూర్య కిరణ్ కి తెలిసి ఆయనే కళ్యాణి నుంచి విడాకులు తీసుకున్నాడంటు మరి కొంతమంది మరికొన్ని రూమర్లను కూడా సృష్టించారు. అయితే కళ్యాణి విడాకుల విషయంలో జగపతిబాబుకి ఎలాంటి సంబంధం లేదని కళ్యాణి కూడా ఒక ఇంటర్వ్యూ లో చెప్పడం జరిగింది. ఇలా ఆన్ స్క్రీన్ మీద వీళ్ళిద్దరూ బెస్ట్ కాంబినేషన్ గా చాలా రోజులపాటు వెలుగొందారు…