KCR Chinajiyar: ఆ స్వామిని కేసీఆర్ శిఖరం అనుకున్నాడట? అందుకే తెలంగాణలోనే అతిపెద్ద ఆలయాన్ని ఆయన చేతుల్లో పెట్టాడట.. అంతేకాదు.. ‘సమతామూర్తి’ పేరిట నెలకొల్పిన ఆలయాన్ని సర్వాంగసుందరంగా తీర్చిద్దేందుకు అన్ని మౌళిక వసతులు కల్పించాడట.. తీరా ఓపెనింగ్ శిలాఫలకంపై చూస్తే కేసీఆర్ కు దిమ్మదిరిగి బొమ్మ కనపడిందట..
‘పగతో రగిలిపోతున్న బొమ్మాళీ’ అంటూ అరుంధతి సినిమాలో విలన్ ఎంతగా ఊగిపోయారో ఇప్పుడు సీఎం కేసీఆర్ కూడా అలాగే ఊగిపోతున్నారన్న గుసగుసలు ఆ నోటా ఈనోటా బయటపడుతోంది.కేసీఆర్ ఎంతో దైవంగా పూజించే ‘చిన్న జీయర్’ స్వామి చేసిన ఈ పనిని కేసీఆర్ తట్టుకోలేకపోతున్నాడని ప్రచారం సాగుతోంది.
ఇప్పటికే ‘యాదాద్రి’ ఆలయ నిర్మాణ బాధ్యతలను ‘చినజీయర్’ స్వామి చేతుల్లో పెట్టాడట కేసీఆర్. ఆయన సూచనల ప్రకారమే కోట్లు ఖర్చు పెట్టి ఆలయాన్ని తీర్చిదిద్దాడు. ఇక హైదరాబాద్ శివారులోని మారుమూలన ఉన్న ‘సమతామూర్తి’ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాడు.కేసీఆర్ మద్దతు, లేకుంటే ఆ రోడ్లు, ఆ గ్రామానికి, అక్కడి ప్రాంతానికి అంతటి దశ వచ్చేది కాదు.
Also Read: KCR-Chinna Jeeyar Swamy: చిన్న జీయర్ స్వామికి కేసీఆర్ తో చిక్కులు తప్పవా?
ఇంత చేస్తే దాన్ని మోడీతో ఆవిష్కరింపచేశాడు చిన్నజీయర్ స్వామి. మొత్తం బీజేపీ, ఆర్ఎస్ఎస్ ను రంగంలోకి దించాడు. సరే పోనీలే అనుకుంటే అసలు మోడీ ఆవిష్కరించిన శిలా ఫలకంలో లోకల్ సీఎం కేసీఆర్ పేరు లేకపోవడమే ఇప్పుడు ఆయనలో కోపం నాశాలానికి ఎక్కడానికి కారణమట.. మొత్తం తాను చేస్తే బీజేపీ, మోడీ క్రిడెట్ తీసుకుపోయిందని.. సమతామూర్తి ఖ్యాతి తనకు రాలేదని.. ఇదంతా చిన్నజీయర్ స్వామి చేశాడని కేసీఆర్ రగిలిపోతున్నట్టు మీడియాలో, రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అది నిజమో కాదో తెలియదు కానీ ఈ గుసగుసలు మాత్రం వినిపిస్తున్నాయి.
ఈవిషయం చిన్నజీయర్ వరకూ కూడా చేరడంతో వెంటనే రాష్ట్రపతి ఆవిష్కరించే శిలా ఫలకంలో కేసీఆర్ పేరు చేర్చారట..కానీ పట్టింపులు, పంతాలకు ప్రాణమిచ్చే కేసీఆర్ ఈ విషయంలో చిన్నజీయర్ స్వామిపై కోపం తగ్గించుకోవడం లేదని ఇన్ సైడ్ టాక్.. కేసీఆర్ బీజేపీపై రగిలిపోవడానికి ఇది కూడా ఓ కారణం అంటున్నారు..
Also Read: KCR Mamatha: కాంగ్రేసేతర కూటమికి బీజం..? కేసీఆర్, స్టాలిన్ కు మమత ఫోన్