https://oktelugu.com/

జగన్ లేఖ.. ఢిల్లీలో ఏం జరుగుతోంది?

ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్, న్యాయవ్యవస్థపై జరుగుతున్న పరిమాణాలపై జోరుగా చర్చ సాగుతోంది. జగన్ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ లేఖపై కొందరు న్యాయవాదులు జగన్ కు మద్దతు పలుకుతుండగా మరి కొందరు విమర్శిస్తున్నారు. ఈ లేఖ వ్యవహారంపై దేశంలో ప్రముఖ న్యాయవాదులు సైతం జోక్యం చేసుకోవడం చర్చనీయాంశాంగా మారింది. Also Read: అజ్ఞాతవాసి.. మన చంద్రబాబు! తాజాగా ప్రముఖ సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషన్ జగన్ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 18, 2020 / 01:24 PM IST
    Follow us on

    ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్, న్యాయవ్యవస్థపై జరుగుతున్న పరిమాణాలపై జోరుగా చర్చ సాగుతోంది. జగన్ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ లేఖపై కొందరు న్యాయవాదులు జగన్ కు మద్దతు పలుకుతుండగా మరి కొందరు విమర్శిస్తున్నారు. ఈ లేఖ వ్యవహారంపై దేశంలో ప్రముఖ న్యాయవాదులు సైతం జోక్యం చేసుకోవడం చర్చనీయాంశాంగా మారింది.

    Also Read: అజ్ఞాతవాసి.. మన చంద్రబాబు!

    తాజాగా ప్రముఖ సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషన్ జగన్ సుప్రీం కోర్టు జడ్జికి రాసిన లేఖపై స్పందించారు. చట్టం ముందు అందరు సమానులేనని, అలాంటి సమయంలో న్యాయవాదులు తప్పు చేస్తే ప్రధానన్యాయమూర్తికే చెప్పుకోవాలి గదా.. అని చెప్పారు. అలాగే ఈ లేఖలోని రహస్యాలను బయటపెట్టడంపై కొందరు న్యాయవాదులు తప్పుబట్టారు. వీరిపై కూడా ప్రశాంత్ భూషణ్ ఘాటుగా స్పందించారు. న్యాయవాదులపై ఆరోపణలు ప్రజలకు తెలియాలని, అప్పుడే న్యాయవ్యవస్థపై నమ్మకం ఏర్పడుతుందన్నారు. తప్పు చేసిన వారిందరికీ ఒకే చట్టం ఉండాలన్నదే తన అభిప్రాయమని చెప్పుకొచ్చారు. న్యాయవాదుల తప్పులు ప్రజలకు ఎందుకు తెలియకూడదో అర్థం కావడం లేదని అన్నారు. న్యాయమూర్తుల తప్పుల గురించి రహస్యంగా ఉంచితే న్యాయవ్యవస్థను తొక్కపడేసినట్లేనన్నారు. ఈ విషయంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి విచారణ చేపట్టాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు.

    జగన్ రాసిన లేఖపై రెండు రకాలుగా చర్యలు తీసుకోవచ్చని ప్రశాంత్ భూషన్ ఓ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో అంతర్గత కమిటీ ద్వారా విచారణ జరపొచ్చని, రెండో అభిశంసన ద్వారా విచారణ చేపట్టడం. ఇక అభిశంసన విషయానికొస్తే దాంట్లో పార్లమెంట్ సభ్యుల పాత్ర ఉంటుందని, ఈ విషయం బయటికి రానంతవరకు పార్లమెంట్ సభ్యులు కూడా సంతకం చేసేందుకు ముందుకు రారని పేర్కొన్నారు.

    కాగా జగన్ లేఖ రాయడంపై కోర్టు ధిక్కరణగా కొందరు న్యాయవాదులు భావిస్తున్నారు. అయితే న్యాయమూర్తులపై ఆరోపణలు వస్తే ఎలా విచారణ చేపట్టగమని, ఇలాంటివి రహస్యంగా ఉంచితే కోర్టు నోరు మూసివేయడమేనని చెప్పకొచ్చారు. న్యాయవ్యవస్థలో జరిగిన తప్పులపై చర్చించేందుకు ప్రజలకు స్వేచ్ఛ ఉండాలని తెలిపారు.

    Also Read: వచ్చే నెల 20 నుంచి తుంగభద్ర పుష్కరాలు

    ఇక బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఢిల్లీ బార్ అసోసియేషన్‌కు చెందిన పలువురు తెలుగు న్యాయవాదులు ఆంధ్రప్రదేశ్ సిఎం జగన్ మోహన్ రెడ్డి తాజాగా సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కు రాసిన లేఖపై స్పందించారు. జగన్ కు మద్దతు పలికారు. లోటుపాట్లను తెలుసుకొని ఇంటెలిజెన్స్ ద్వారా సమగ్రంగా విచారణ చేసిన తర్వాతే జగన్ ఈ స్టెప్ వేశాడని.. లోపాలను ఎత్తి చూపాడని వారు అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో కూడా జగన్ కు మద్దతు రావడం విశేషంగా చెప్పవచ్చు. ఇలా ఢిల్లీ వేదికగా న్యాయవ్యాధుల్లో జగన్ లేఖపై భిన్నాభిప్రాయలు నెలకొన్నాయి. దీనిపై ఏం జరుగుతుందనేది ఆసక్తిగా మారింది.