https://oktelugu.com/

ఉప్పెన మొదటి హీరో విజయ్ దేవరకొండ.. ఎందుకు తప్పుకున్నాడంటే?

ఉప్పెన మూవీ ఇప్పుడు టాలీవుడ్ ను ఊపేసింది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు తీసిన ఈ చిత్రం అందరి ప్రేక్షకుల మెప్పు పొంది ప్రేక్షకాదరణతో దూసుకుపోతోంది. అయితే నిజానికి ఈ ఉప్పెన కథ చేయాల్సింది అందులో నటించిన మెగా హీరో కాదట.. ఈ విషయం తాజాగా తెలిసింది. మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఉప్పెన మూవీతోనే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తన తొలి చిత్రంతోనే అందరినీ ఆకట్టుకున్నారు. ఉప్పెన సినిమాతో మంచి నటుడిగా గుర్తింపు పొందిన వైష్ణవ్ తన […]

Written By: , Updated On : February 17, 2021 / 06:57 PM IST
Follow us on

ఉప్పెన మూవీ ఇప్పుడు టాలీవుడ్ ను ఊపేసింది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు తీసిన ఈ చిత్రం అందరి ప్రేక్షకుల మెప్పు పొంది ప్రేక్షకాదరణతో దూసుకుపోతోంది. అయితే నిజానికి ఈ ఉప్పెన కథ చేయాల్సింది అందులో నటించిన మెగా హీరో కాదట.. ఈ విషయం తాజాగా తెలిసింది.

మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఉప్పెన మూవీతోనే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తన తొలి చిత్రంతోనే అందరినీ ఆకట్టుకున్నారు. ఉప్పెన సినిమాతో మంచి నటుడిగా గుర్తింపు పొందిన వైష్ణవ్ తన తొలి సినిమాతోనే రికార్డులు సృష్టించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు. సినిమా ఇప్ప‌టికే రూ.38 కోట్ల రూపాయ‌ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించింది. ఏ తొలి సినిమా హీరో సినిమాకు రాని క‌లెక్ష‌న్స్ వైష్ణవ్ సాధించాడు..

అయితే ఉప్పెన కథ రాసుకునేటప్పుడు దర్శకుడు బుచ్చిబాబు మదిలో వైష్ణవ్ తేజ్ ను అనుకోలేదట.. ఈ సినిమాకు మొదటగా రౌడీ హీరో విజయ్ దేవరకొండను అనుకున్నారంట. కానీ ఆ తరవాత వైష్ణవ్ తేజ్‌ను ఓకే చేశారంట. మొదట వైష్ణవ్‌ను చూసినప్పుడు అతడి కళ్లు బాగా నచ్చాయని, అతడైతే ఇంకా బాగుంటుందని అనుకున్నారంట. తన కథలోని హీరో పాత్రకి వైష్ణవ్ సరిగ్గా సరిపోతాడని అనిపిచిందని బుచ్చిబాబు అన్నారు.

విజయ్‌ దేవరకొండను ఎందుకు సినిమాలో నటించమని అడగలేదనే దానిపై కూడా బుచ్చిబాబు క్లారిటీ ఇచ్చారు. విజయ్ దేవరకొండ రేంజ్ ఇప్పుడు చాలా పెరిగిందని.. ఆ స్థాయిలో ఉన్నప్పుడు అతడి అంచనాలకు ఈ కథ సరిపోదని అనిపించిందని, అందుకనే విజయ్‌ని కమిట్ అవ్వలేదని అన్నారు. మొత్తంగా ఓ హిట్ చిత్రం కొత్త హీరో వైష్ణవ్ కు అదృష్టంగా మారింది.

వైష్ణ‌వ్ తేజ్ తొలి సినిమా ఉప్పెన విడుద‌ల కాక ముందే మ‌రో సినిమాలో ఓకే కావడం విశేషంగా చెప్పొచ్చు.. వైష్ణవ్ తేజ్ తన రెండో సినిమాని స్టార్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో చేస్తున్నారు.