CM Vijay: తమిళ హీరో విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టి సరిగ్గా 48 గంటలు మాత్రమే అయ్యింది. ఈ 48 గంటల్లో ఆయన ఎలాంటి రాజకీయాలకు తెరలేపాడో మనమంతా చూస్తూనే ఉన్నాం. దేశంలో ఏ నాయకుడు కూడా ముఖ్యమంత్రి గా గెలిచినప్పుడు ప్రధాన ప్రతిపక్షాన్ని కలవడం చేయలేదు. కానీ విజయ్ ప్రధాన ప్రతిపక్ష నేత ఇంటికి వెళ్లి మరీ ఆయన్ని గౌరవించడం , ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతీ పార్టీ నేత ఇంటికి వెళ్లి కలిసి, వాళ్ళను ప్రత్యేకంగా గౌరవించి ప్రేమతో మాట్లాడడం వంటివి చేశాడు. పాజిటివ్ రాజకీయాలకు తెరలేపాడు. ఇవన్నీ పక్కన పెడితే , మరో పక్క ఆయన పాలన పరంగా కూడా సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నాడు. దేశం లో ఏ ముఖ్యమంత్రి కూడా ఇప్పటి వరకు ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇంతకీ అదేంటో చూద్దాం.
మన తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల చూసే ఉంటాము, దేవాలయాలు ఉన్న సమీపం లో కానీ , విద్య సంస్థలు , బాస్ స్టాప్స్ ఉన్న సమీపాల్లో కానీ , మందు షాపులు ఉండడం. చాలా మంది రిక్వెస్ట్ కూడా చేశారు , ఇలాంటి ప్రాంతాల్లో మందు షాప్స్ దూరంగా ఉండేలా చేయమని , కానీ పెద్దగా పట్టించుకోలేదు మన ప్రభుత్వాలు. కానీ విజయ్ అలాంటివి అసలు ప్రోత్సహించడం లేదు. దేవాలయాలు , చర్చీలు , మసీదులు, విద్యాసంస్థలు, బస్సు స్టేషన్స్ ఉన్న ప్రదేశాల్లో 500 మీటర్ల రేడియస్ లో మందు షాప్స్ ఉండరాదని , రెండు వారాల్లో ఆ ఖాళీ చెయ్యాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ ఒక జీవో ని విడుదల చేశాడు. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా 4 వేలకు పైగా మద్యం దుకాణాలు ఉంటే, అందులో 717 మద్యం దుకాణాలు ఇలాంటి ప్రదేశాల్లో ఉన్నట్టు గుర్తించారు.
ఇప్పుడు వాటిని రెండు వారాల్లోపే మూసి వేయబోతున్నారు అధికారులు. ఇది సీఎం గా విజయ్ తీసుకున్న సంచలనాత్మక నిర్ణయం అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. అధికారం చేపట్టిన రెండు రోజుల్లోనే ఇలాంటి విప్లవాత్మక నిర్ణయాన్ని తీసుకోవడం అనేది సాధారణమైన విషయం కాదు. జనాలకు నిజమైన సర్వీస్ చెయ్యాలి అని కోరుకునేవాళ్ళు చేసే పనులు ఇలాగే ఉంటాయి. విజయ్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు కూడా తీసుకోవచ్చు. మరోపక్క విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం పై పార్టీలకు అతీతంగా ప్రతీ ఒక్కరు హర్షిస్తూ మెచ్చుకుంటున్నారు. విజయ్ పాలన ఇదే మార్క్ తో కొనసాగిస్తే ఆయనకు తిరుగే ఉండదు అనడంలో ఎలాంటి సందేహం లేదు.