Homeఎంటర్టైన్మెంట్Varanasi Movie: వారణాసి మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ అన్ని వేల కోట్లు జరగబోతుందా...

Varanasi Movie: వారణాసి మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ అన్ని వేల కోట్లు జరగబోతుందా…

Varanasi Movie: రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వస్తున్న వారణాసి సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. 2027 ఏప్రిల్ నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా మీద ఇప్పటికే ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉన్నాయి. అయితే ఈ సినిమా కాన్సెప్ట్ ను తెలియజేస్తూ సినిమా యూనిట్ ఒక వీడియోనైతే రిలీజ్ చేశారు. ఆ వీడియో ప్రేక్షకులందరిని విపరీతంగా ఆకట్టుకుంది. అయితే మహేష్ బాబు ఇందులో మొదటిసారి 5 డిఫరెంట్ గెటపుల్లో నటించబోతున్నాడు… దాంతో ఈ సినిమా మీద భారీగా ఖర్చు పెట్టి విజువల్ వండర్ గా ఈ సినిమాని తెరకెక్కించాలనే ఉద్దేశ్యంలో రాజమౌళి ఉన్నాడు. కాబట్టి ప్రతి చిన్న విషయంలో కూడా ఆయన చాలావరకు కేర్ ఫుల్ గా వ్యవహరిస్తూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం…ఇక ఇప్పటివరకు రాజమౌళి చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి.

కానీ ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో ఆయన ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఎందుకంటే ఆయనకు పాన్ ఇండియాలో భారీ పాపులారిటి దక్కింది. ఇప్పుడు పాన్ వరల్డ్ లో సైతం తన సత్తా ఏంటో చూపించాలనే ప్రయత్నంలో ఉన్నాడు.

ఇక ఇదిలా ఉంటే వారణాసి సినిమా సెట్స్ మీద ఉండగానే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ రేంజ్ లో జరగబోతుంది అంటూ వార్తలైతే వస్తున్నాయి. నిజానికి ఈ మూవీ ఓటిటి రైట్స్ కోసం నెట్ ఫ్లిక్స్ సంస్థ 500 కోట్ల వరకు కేటాయిస్తుందంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు. నిజానికి ప్రముఖ ఓటీటి ప్లాట్ ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ సంస్థ ఇండియాలో ఉన్న అన్ని భాషల్లో తమ సినిమాని స్ట్రీమింగ్ చేయడానికి వారణాసి టీమ్ కి 500 కోట్ల వరకు ఆఫర్ అయితే ఇచ్చినట్టుగా తెలుస్తుంది.

ఇక రాజమౌళి ఇప్పటికి ఆ విషయం మీద ఎలాంటి స్పందనను తెలియజేయడం లేదు. ఈ సినిమాకు భారీ క్రేజ్ క్రియేట్ అయిన తర్వాత ఆటోమేటిగ్గా ఇతర ఓటిటి సంస్థలు పోటీకి వస్తాయి. కాబట్టి అప్పుడు ఇంకా ఎక్కువ బిజినెస్ జరిగే అవకాశం ఉందనే ఉద్దేశంతో రాజమౌళి ఈ డీల్ అయితే కొట్టి పారేసినట్టుగా తెలుస్తుంది. ఇక అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 2500 కోట్ల వరకు బిజినెస్ ని జరుపుకునే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి ఈ సినిమా కోసం 1500 కోట్లు బడ్జెట్ ను కేటాయిస్తున్నాడు. కాబట్టి ఈ సినిమా భారీ విజయాన్ని సాధించాల్సిన అవసరమైతే ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version