Mahesh Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబుకి చాలా మంచి క్రేజ్ ఉంది. ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ స్టార్ట్ చేసిన మహేష్ బాబు ‘రాజకుమారుడు’ సినిమాతో ఫుల్ టైం హీరోగా మారాడు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో అతనికి హీరోగా గుర్తింపైతే వచ్చింది. అప్పటినుంచి ఇప్పటివరకు వెను తిరిగి చూడకుండా వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం… ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘వారణాసి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడున్న హీరోల్లో మహేష్ బాబు – జూనియర్ ఎన్టీఆర్ మధ్య చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉందనే విషయం మనందరికి తెలిసిందే. నందమూరి ఫ్యామిలీ మూడోవ తరం హీరోగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ సైతం చాలా తక్కువ సమయంలోనే టాప్ హీరోగా మారిపోయాడు. ఇప్పటికి మహేష్ బాబుకి జూనియర్ ఎన్టీఆర్ కి మధ్య చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఎన్టీఆర్ – మహేష్ బాబుని అన్నా అని పిలుస్తూ ఉంటాడు.
ఇలాంటి క్రమంలోనే మహేష్ బాబు చేసిన సినిమా మొదట జూనియర్ ఎన్టీఆర్ వద్దకు వెళ్లిందట. అయితే ఎన్టీఆర్ ఆ కథ మీద ఇంట్రెస్ట్ చూపించినప్పటికి అప్పటికే మహేష్ బాబు ఆ కథను విని ఓకే చేయాలా వద్దా అనే డైలమా లో ఉన్నాడట. మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ ఆ కథని వదిలేయడంతో మహేష్ బాబు ఆ సినిమాని చేశాడు.
ఇంతకీ ఆ సినిమా ఏంటంటే మహేష్ బాబు హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘అతిధి’ సినిమా కావడం విశేషం…ఇక ఎన్టీఆర్ తో ‘అశోక్’ సినిమా చేసి ఫ్లాప్ ని అందించిన సురేందర్ రెడ్డి మరోసారి జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలని అతిధి సినిమా కథను కూడా తనకే వినిపించాడట. ఆ కథ ఎన్టీఆర్ కి బాగా నచ్చింది.
అయితే అప్పటికే మహేష్ బాబుకి కూడా ఆ కథను వినిపించడంతో మహేష్ బాబు నేను ఆ సినిమా చేస్తానని జూనియర్ ఎన్టీఆర్ ని రిక్వెస్ట్ చేయడంతో ఎన్టీఆర్ ఆ మూవీ నుంచి తప్పుకున్నాడట…ఫైనల్ గా సినిమా డిజాస్టర్ టాక్ నైతే మూట గట్టుకుంది. కానీ మహేష్ బాబు లుక్స్ పరంగా గానీ, యాక్షన్ ఎపిసోడ్స్ లో గాని ఆయన చూపించిన తీరు చాలా వైవిధ్యంగా ఉందనే చెప్పాలి…