Motivator Vamsi : సోషల్ మీడియా మోటివేటర్ వంశీ విడాకుల ప్రకటనతో షాక్ ఇచ్చాడు. భార్య నేత్రతో విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చాడు. సోషల్ మీడియా జనాలకు వంశీ పరిచయం అక్కర్లేని పేరు. ఇతడి మోటివేషన్ వీడియోలకు మంచి డిమాండ్. లక్షల మంది ఫాలో అవుతున్నారు. వంశీ రెండేళ్ల క్రితం నేత్రను వివాహం చేసుకున్నాడు. వంశీ భార్య నేత్ర కూడా అతని ఫాలోవర్స్ కి పరిచయమే.
కొన్నాళ్లుగా వీరు విడిగా ఉంటున్నారు. ఈ క్రమంలో వంశీ-నేత్ర విడాకులు తీసుకుంటున్నారంటూ వార్తలు వచ్చాయి. ఊహించిందే నిజమైంది. అధికారికంగా వంశీ విడాకుల ప్రకటన చేశాడు. తాము విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. పరస్పర అవగాహనతో విడిపోతున్నట్లు వెల్లడించాడు.
”డియర్ ఫ్రెండ్స్ నేత్ర నేను రెండేళ్ల పాటు కలిసి జీవించాము. ఇప్పుడు విడిపోవాలి అనుకుంటున్నాము. ఇది మా ఇద్దరి ఏకాభిప్రాయం. పరస్పర అవగాహనతో తీసుకున్న నిర్ణయం. మా వ్యక్తిగత జీవితాలు, మార్గాలపై మాకు నమ్మకం ఉంది. నా శ్రేయోభిలాషులు, మిత్రులు నాకు మద్దతుగా నిలుస్తూ వచ్చారు. మీ ప్రేమ, ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు”’ అని రాసుకొచ్చాడు.
వీరి అభిమానులు మాత్రం విచారం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఎందుకు విడిపోయారో తెలుసుకోవాలని అనుకుంటున్నారు. నేత్ర నటిగా మారడం, సినిమాల్లోకి వెళ్లడం వంశీకి ఇష్టం లేదని. ఈ విషయంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తి విడిపోయారనే టాక్ వినిపిస్తుంది. అసలు కారణం ఏమిటో ఇక వారికే తెలియాలి. ఈ రోజుల్లో విడాకులు చాలా చిన్న విషయం.