Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan Harish Shankar Controversy: హరీష్ శంకర్ పై పవన్ కళ్యాణ్ సీరియస్!?

Pawan Kalyan Harish Shankar Controversy: హరీష్ శంకర్ పై పవన్ కళ్యాణ్ సీరియస్!?

Pawan Kalyan Harish Shankar Controversy: దర్శకుడు హరీష్ శంకర్ పై పవన్ కళ్యాణ్(PAWAN KALYAN) సీరియస్ అయ్యాడన్న వార్త టాలీవుడ్ లో జోరుగా సాగుతోంది. బ్లాక్ బస్టర్ ఇచ్చిన హరీష్ పై పవన్ కళ్యాణ్ ఎందుకు కోపం వచ్చింది.

పవన్ కళ్యాణ్ కెరీర్లో గబ్బర్ సింగ్ కి ప్రత్యేక స్థానం ఉంది. పదేళ్ల పాటు క్లీన్ హిట్ లేక ఇబ్బంది పడ్డ పవన్ కళ్యాణ్ కి ఉపశమనం కలిగించిన చిత్రం అది. ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకుడు. గబ్బర్ సింగ్ హిందీ బ్లాక్ బస్టర్ దబంగ్ కి అధికారిక రీమేక్. అయితే హరీష్ శంకర్(HARISH SHANKAR) కేవలం స్టోరీ, కోర్ ఎమోషన్ తీసుకుని సరికొత్తగా రూపొందించారు. గబ్బర్ సింగ్ మూవీలోని సీన్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. హరీష్ రాసిన వన్ లైనర్స్ ఎవర్ గ్రీన్. దాంతో పవన్ కళ్యాణ్ అభిమానులకు కూడా గబ్బర్ సింగ్ మరచిపోలేని చిత్రం.

Aslo Read: రజినీకాంత్ చివరి చిత్రం అదేనా..?అతని డ్రీమ్ మూవీ కోసం అడుగులు వేస్తున్నాడా..?

ఈ కాంబో రిపీట్ కావాలని చాలా కాలంగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ ఇకపై సినిమాలు చేయనని ప్రకటించడంతో అది కలగానే మిగిలిపోతుందని అందరూ భావించారు. 2019 చివర్లో పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ ప్రకటించారు. వరుసగా చిత్రాలకు సైన్ చేశారు. వాటిలో హరీష్ శంకర్ చిత్రం కూడా ఒకటి. భవదీయుడు భగత్ సింగ్ టైటిల్ తో హరీష్ శంకర్-పవన్ కళ్యాణ్ కాంబోలో చిత్రాన్ని ప్రకటించడం జరిగింది.

అయితే ఈ ప్రాజెక్ట్ గట్టెక్కలేదు. ఆ సబ్జెక్టు పక్కన పెట్టి ఉస్తాద్ భగత్ సింగ్ ని తెరపైకి తెచ్చారు. ఇది తేరి రీమేక్ అనే వాదన ఉంది. రాజకీయంగా బిజీ అయిన పవన్ కళ్యాణ్ సెట్స్ పై ఉన్న చిత్రాలను పక్కన పెట్టారు. 2024లో ఏపీలో జనసేన భాగస్వామిగా ఉన్న కూటమి ఘన విజయం సాధించింది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా మంత్రి పదవి చేపట్టారు. కొన్ని నెలలుగా పవన్ కళ్యాణ్ తిరిగి షూటింగ్స్ కి హాజరవుతున్నారు. హరి హర వీరమల్లుకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేశారు. అలాగే ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల షూటింగ్స్ లో కూడా పాల్గొంటున్నారు.

Also Read: ‘హరి హర వీరమల్లు’ మొదటిరోజు వరల్డ్ వైడ్ వసూళ్లు..పవన్ రేంజ్ కి చిల్లరే ఇది!

కాగా ఉస్తాద్ భగత్ సింగ్ కి కేటాయించిన డేట్స్ హరీష్ శంకర్ సరిగా వాడుకోవడం లేదట. ఉన్న అతి తక్కువ సమయాన్ని వృధా చేస్తున్నారట. తన బిజీ షెడ్యూల్స్ మధ్య డేట్స్ కేటాయిస్తే హరీష్ షూటింగ్ కి సిద్ధంగా లేకపోవడం పవన్ కళ్యాణ్ ని ఆగ్రహానికి గురి చేసిందట. దాంతో హరీష్ మీద పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యాడట. అలిగిన హరీష్ రెండు రోజులు షూటింగ్ కి రాలేదంటూ టాలీవుడ్ వర్గాల్లో పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ వార్తల్లో నిజమెంతో తెలియాల్సి ఉంది.

Exit mobile version