Rajamouli : దర్శక ధీరుడు రాజమౌళి పాన్ ఇండియా రేంజ్ లో బాహుబలి లాంటి సినిమాను తీసి తెలుగు సినిమా రేంజ్ ని పెంచిన డైరెక్టర్ గా చరిత్రలో నిలిచి పోయాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం మహేష్ బాబుతో చేస్తున్న సినిమా పాన్ వరల్డ్ గా రూపొందించడమే కాకుండా ఒక అడ్వెంచర్ జానర్ కి సంబంధించిన కథను ఎంచుకొని ఇప్పటివరకు తెలుగులో గాని, ఇండియాలో గానీ ఎప్పుడు రాని ఒక కథ ని ఎంచుకొని భారీ రేంజ్ లో, భారీ హంగులతో ఈ సినిమాని చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాడు. ఇక ఇలాంటి పరిస్థితుల్లో రాజమౌళి ఈ సినిమా తో కనక భారీ సక్సెస్ సాధిస్తే హాలీవుడ్ రేంజ్ అతని పేరు మారు మ్రోగిపోతుంది.
ఇక హాలీవుడ్ లోని టాప్ 10 డైరెక్టర్లలో ఒకడి గా రాజమౌళి తన పేరును సుస్థిరం చేసుకుంటాడు అని అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ రాజమౌళి తనకిష్టమైన డైరెక్టర్లు ఎవరు అనే ప్రశ్నకి ఒక్కొక్కసారి ఒక్కో డైరెక్టర్ పేరు చెబుతూ వస్తున్నాడు. బిజినెస్ మాన్ సినిమా సమయంలో పూరి జగన్నాథ్ గారు అంటే నాకు చాలా ఇష్టం,ఆయన మేకింగ్ అంటే చాలా ఇష్టం,తక్కువ రోజుల్లో అంత క్వాలిటీ సినిమాని ఎలా తీస్తాడు అని నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు అని చెప్పుకుంటూ వచ్చారు.
ఇక ఆ తర్వాత వన్ సినిమా సమయంలో నాకు సుకుమార్ గారు అంటే చాలా ఇష్టమని రాజమౌళి చెప్పాడు నాకు పోటీ ఇచ్చే డైరెక్టర్ కూడా సుకుమార్ అని చాలా గట్టి నమ్మకంతో చెప్తున్నాను అని స్ట్రాంగ్ గా చెప్పాడు.ఇక అందుకు తగ్గట్టుగానే సుకుమార్ రంగస్థలం సినిమా తీసి ఇండస్ట్రీ హిట్ ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు తనకు పోటీ ఇచ్చే డైరెక్టర్ ఎవరు అని ఒక ఇంటర్వ్యూ లో అడిగితే పూరి జగన్నాథ్, సుకుమార్ లను పక్కనపెట్టి సందీప్ రెడ్డి వంగ పేరు చెప్పడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
ఆయన అలా చెప్పడానికి గల కారణం ఏంటి అంటే సందీప్ ఒక కొత్త తరం కథలతో వచ్చి తన మేకింగ్ తో ప్రేక్షకులను మైమరిపింప చేస్తాడు. అలాంటి క్వాలిటీస్ అన్ని సందీప్ లో ఉన్నాయి కాబట్టే నాకు సందీప్ అంటే ఇష్టం నాకు పోటీ ఇచ్చే డైరెక్టర్ కూడా అతనే అంటూ చెప్పాడు…ఇక దాంతో ఇప్పుడు అనిమల్ సినిమా రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకుంటుంది…
అయితే రాజమౌళి కి ఇష్టమైన డైరెక్టర్స్ లిస్ట్ లో తెలుగు లో మంచి సినిమాలు తీస్తూ డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న త్రివిక్రమ్ లేకపోవడం ఆయన అభిమానులను బాధపడుతుంది…