Trivikram And Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన ప్రతి సినిమా అతని ఇమేజ్ ను పెంచే విధంగానే ఉంటుంది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో చేసిన సినిమాలు సైతం అతనికి ఒక గొప్ప గుర్తింపును తీసుకొచ్చి పెట్టాయి. ఇక ఇలాంటి క్రమంలోనే వీళ్లిద్దరి కాంబోలో మరో సినిమా వస్తే చూడాలని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పాలిటిక్స్ లో చాలా యాక్టివ్ గా ఉన్నాడు. ఏపీ డిప్యూటీ సీఎం గా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడప్పుడే వీళ్ళ కాంబినేషన్లో సినిమా వచ్చే అవకాశం లేదు. ఇక దానికి తోడుగా త్రివిక్రమ్ సైతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ చేసే సినిమాల విషయంలో త్రివిక్రమ్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ చేసే ప్రతి కథ త్రివిక్రమ్ ముందే చదివి అందులో పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేస్తున్నారు. ముఖ్యంగా ఎలాంటి సినిమాలు చేస్తే పవన్ కళ్యాణ్ ఇమేజ్ పెరుగుతుందనే ధోరణిలో ఆలోచించి ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలను రచిస్తూ పవన్ కళ్యాణ్ ను అలాంటి క్యారెక్టర్ లో చూపించడానికి సన్నాహాలు చేస్తుంటాడు. ఇక ముఖ్యంగా ఇతర భాషల్లో హిట్ ఆయన సినిమాలను రీమేక్ చేయడానికి ఎక్కువగా ప్రిఫేరెన్స్ ఇస్తున్నారు.
నిజానికి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉన్న బిజీ కి సొంత కథలైతే ఇబ్బందని రీమేక్ కథలను మన నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి పవన్ కళ్యాణ్ చేత సినిమాలు చేస్తున్నాడు. దీనివల్ల పవన్ కళ్యాణ్ బాగానే ఉంటున్నాడు, త్రివిక్రమ్ బానే ఉంటున్నాడు. కానీ ఆ సినిమాకు దర్శకత్వం వహించే దర్శకులు కొంతవరకు ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు అంటూ కొన్ని వార్తలైతే బయట వినిపిస్తున్నాయి.
నిజానికి ఆయా దర్శకులు ఆయా సినిమాల మీద ఎంత ఎఫర్ట్ పెట్టినా కూడా త్రివిక్రమ్ డామినేషన్ ఎక్కువ అవుతుండడంతో వాళ్లు వాళ్ళు అంత ఎఫెక్టివ్ గా ఇన్వాల్వ్ అవ్వడం లేదట. అందుకే ఈ మధ్యకాలం లో పవన్ కళ్యాణ్ చేసిన సినిమాలు ఫ్లాప్ అవ్వడానికి కారణం త్రివిక్రమ్ అంటూ మరికొంతమంది వాపోతున్నారు.
ముఖ్యంగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘భీమ్లా నాయక్’ అంత పెద్ద సక్సెస్ సాధించలేదు. దానికి కూడా త్రివిక్రమ్ కారణం అంటూ కొన్ని వార్తలైతే వచ్చాయి. ఇక సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ‘బ్రో’ సినిమా కూడా విజయాన్ని సాధించకపోవడానికి త్రివిక్రమ్ కారణమంటు గతంలో కొన్ని వార్తలు వచ్చాయి…
