Homeఎంటర్టైన్మెంట్Trisha Krishnan: సినిమాలకు శాశ్వతంగా గుడ్ బై చెప్పనున్న హీరోయిన్ త్రిష.. చివరి చిత్రం అతనితోనే..

Trisha Krishnan: సినిమాలకు శాశ్వతంగా గుడ్ బై చెప్పనున్న హీరోయిన్ త్రిష.. చివరి చిత్రం అతనితోనే..

Trisha Krishnan: తమిళనాడు లో ఇప్పుడు ఎక్కడ చూసినా హీరోయిన్ త్రిష(Trisha Krishnan) పేరే వినిపిస్తోంది. గత మూడు నెలలుగా త్రిష పేరు లేకుండా తమిళనాడు రాజకీయాలు నడవడం లేదు. అందుకు ముఖ్య కారణం , తమిళ సూపర్ స్టార్, TVK పార్టీ అధినేత విజయ్(Thalapathy Vijay) తో ఆమెకు ఉన్న రిలేషన్ బహిర్గతం అవ్వడమే. త్వరలోనే వీళ్లిద్దరు అధికారికంగా పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. భార్య సంగీత తో విడాకులు న్యాయబద్దం గా రావడానికి కొంత సమయం పడుతుంది. అప్పటి వరకు ఈ ప్రేమ జంట ఎదురు చూడక తప్పదు. లేదంటే తమిళనాడు లో ఎన్నికల ముందే ఈ జంట పెళ్లి చేసుకునేవారు. ఇదంతా పక్కన పెడితే త్రిష ఇప్పుడు క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టే ఆలోచనలో ఉందట. రాజ్యాంగబద్ధమైన పదవి చేప్పట్టే ఉద్దేశ్యం ఇప్పట్లో లేదట కానీ, TVK పార్టీ కి సంబంధించిన అంతర్గత వ్యవహారాలు మొత్తం ఇక త్రిష నే చూసుకోబోతుందట.

అంతే కాదు , త్వరలోనే ఆమె ఆ పార్టీ తరుపున ఎన్నికల ప్రచారం కూడా చేయబోతోందని టాక్. అందుకు సంబంధించి కొన్ని నియోజకవర్గాలను కూడా ఆమె ఎంచుకుంది అట. ఇదంతా పక్కన పెడితే ఇకపై ఆమె సినిమాలు చేసే ఆలోచనలో లేదని తెలుస్తోంది. కొత్తగా ఆమె ఎలాంటి సినిమాలో నటించడానికి సంతకం చేయలేదట. గత ఏడాది ఈమె కమల్ హాసన్ హీరో గా నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘టగ్ లైఫ్’ ద్వారా తమిళ, తెలుగు ఆడియన్స్ కి కనిపించింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న సినిమాలు కూడా పూర్తి అయ్యాయి. తమిళ హీరో సూర్య తో కలిసి ‘కరుప్పు ‘ అనే చిత్రం లో హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం వచ్చే నెల 14 న తెలుగు , తమిళ భాషల్లో విడుదల కానుంది. తెలుగు లో ఈ చిత్రం ‘వీరభద్రుడు’ అనే టైటిల్ తో విడుదల కాబోతుంది.

అదే విధంగా మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘విశ్వంభర’ చిత్రం లో కూడా త్రిష హీరోయిన్ గా నటించింది. ఈ ఏడాది దసరా కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటితో పాటు ఆమె ‘రామ్’ అనే మలయాళం చిత్రంలో హీరోయిన్ గా నటించింది. రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి అయ్యింది. మోహన్ లాల్ ఈ చిత్రం లో హీరోగా నటించాడు. ఇలా ప్రస్తుతం తన చేతిలో ఉన్న సినిమాలన్నీ పూర్తి చేసేసింది త్రిష. ఇప్పుడు పూర్తి స్థాయిలో తన ద్రుష్టి మొత్తం TVK పార్టీ మీదనే పెట్టనుంది. చూడాలి మరి త్రిష తమిళనాడు లో మరో జయలలిత అవుతుందా లేదా అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version