Homeఎంటర్టైన్మెంట్Balakrishna Young Heroes Incident: బాలయ్య ఆ ముగ్గురు హీరోలను చితక్కొట్టడానికి కారణం ఇదే...

Balakrishna Young Heroes Incident: బాలయ్య ఆ ముగ్గురు హీరోలను చితక్కొట్టడానికి కారణం ఇదే…

Balakrishna Young Heroes Incident: నందమూరి నటసింహం బాలయ్య బాబు నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ప్రేక్షకుల్లో విపరీతమైన అటెన్షన్ క్రియేట్ అవుతుంది. గత 50 సంవత్సరాల నుంచి ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్నాడు. వాళ్ళ నాన్న అయిన నందమూరి తారక రామారావు గారి లెగసీని కంటిన్యూ చేస్తూ ఆయన నందమూరి ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్తూ ఉండడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి… ఇప్పటివరకు బాలయ్య బాబు చేసిన సినిమాలు అతన్ని మాస్ హీరోగా నిలబెట్టాయి. ఇప్పుడు చేస్తున్న సినిమాలు సైతం కమర్షియల్ సినిమాలే కావడం విశేషం…ఇప్పటివరకు బాలయ్య చాలా అవార్డులు అందుకున్నాడు. తను వైవిధ్య భరితమైన నటనను చూపించిన ప్రతిసారి తనకు గొప్ప అవార్డులతో గౌరవించారు. ఇక ఇలాంటి క్రమంలోనే బాలయ్య బాబు సినిమాలు చేయడమే కాకుండా తనకు కోపం వస్తే ఎవరినైనా సరే కొడతాడు అంటూ ఆయన మీద కొన్ని కథనాలైతే వెలువడుతున్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే ముగ్గురు యంగ్ హీరోలను బాలయ్య బాబు కొట్టాడు అంటూ అంటుకొని వార్తలైతే వచ్చాయి.

ఇంతకీ ఆ హీరోలు ఎవరు వారిని ఎందుకని బాలయ్య కొట్టాడు అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకుందాం… ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం విశ్వక్ సేన్, సిద్ధు జొన్నల గడ్డ, అడవి శేషు వీళ్ళు ముగ్గురు కూడా బాలయ్య బాబుకు సన్నిహితంగా ఉంటారు. ఇక బాలయ్య ఇంట్లో ఎలాంటి ఈవెంట్ జరిగిన వీళ్ళు ముగ్గురు అటెండ్ అవుతుంటారు.

అలా ఒక ఈవెంట్ జరిగినప్పుడు వీళ్ళు ముగ్గురు హాజరు కాలేదట. ఆ తర్వాత వీళ్ళు ముగ్గురు కలిసి బాలయ్యకి కనిపించినప్పుడు వీళ్ళ నెత్తిమీద రెండు మొట్టికాయలు వేస్తూ ఎందుకని మా ఫంక్షన్ కి మీరు రాలేదు అంటూ ఆయన అడిగాడట. దానికి వాళ్ళు షూటింగ్లో బిజీగా ఉండడం అలాగే కొన్ని పర్సనల్ పనుల్లో ఉండడం వల్ల రాలేకపోయామని సమాధానం చెప్పారట.

దాంతో బాలయ్య కూడా నవ్వుతూ మీరంతా నా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి మిమ్మల్ని పిలిచాను. వేరేవాళ్ళనైతే నేనెందుకు పిలుస్తాను అంటూ వాళ్ళను హగ్ చేసుకున్నాడట. మొత్తానికైతే బాలయ్య మెంటాలిటీ చిన్న పిల్లాడిలా ఉంటుందని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా చెప్పుకోవచ్చు…తన వాళ్లు తన ఫంక్షన్ కి రాకపోతే ఫీలవుతాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version