Tollywood Young Hero : తెలుగులో ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్. ఆయన తన బ్యానర్ లో ఎన్నో సినిమాలు చేశారు. అగ్రహీరోలందరితో సినిమాలు చేసిన ఘనత ఆయన సొంతం. ఇక ఆయన పెద్ద కొడుకు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ఇప్పటికే హీరోగా కొనసాగుతున్నాడు. తనదైన శైలిలో నటిస్తూ అందరిని మెప్పిస్తున్నాడు. సినిమాల్లో కొత్తవారు వస్తున్నారు. అంతే వేగంగా వెళ్లిపోతున్నారు. కానీ కొందరే నిలదొక్కుకుంటున్నారు. కొత్తగా వస్తున్న హీరోలు కూడా తమ టాలెంట్ చూపించి వైవిధ్యం ప్రదర్శిస్తున్నారు. దీంతో పాత హీరోలతో సమానంగా వారు కూడా ఎన్నో హిట్లు అందుకుంటుండటం విశేషం.

బెల్లంకొండ సురేష్ రెండో కొడుకు గణేష్ సైతం తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. స్వాతిముత్యం సినిమా ద్వారా తెరంగేట్రం చేయనున్నాడు. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా చూసిన వారు బాగుందని కితాబిస్తున్నారు. గణేష్ ఎంట్రీ గ్రాండ్ గానే ఉండనుంది. ఈ సినిమా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే చిరంజీవి గాడ్ ఫాదర్, నాగార్జున ది ఘోస్ట్ సినిమాలు రానున్న సందర్భంలో స్వాతిముత్యం వారి సినిమాల మధ్య నిలబడుతుందా? అనేది అందరిలో వస్తున్న అనుమానం.
కొత్త హీరో అయినా ధైర్యంతో సీనియర్ హీరోలతో ధీటుగా స్వాతిముత్యంను నిలపాలని చూడటం సాహసమే అని చెప్పాలి. కానీ సినిమా బాగుందనే ఉద్దేశంతో దసరా బరిలో నిలిపారు. ట్రైలర్ చూసిన వారు గణేష్ బాగా చేశాడని చెబుతున్నారు. గణేష్ నటన చాలా అద్భుతంగా ఉందని ప్రశంసిస్తున్నారు. స్వాతిముత్యం చిత్రం మొత్తం వైవిధ్యంగా ఉంది. మొత్తం కుటుంబంతో హాయిగా రెండున్నర గంటలు చూసేందుకు అవకాశం ఉందని అంటున్నారు. ఇందులో ఓ ట్విస్ట్ ఉంది. అదే ఈ సినిమాకు హైలెట్ గా మారనుంది.
ఇందులో గణేష్ స్పెర్మ్ డోనర్ గా నటించాడు. చిత్రం కంటెంట్ మొత్తం ఇదే కాన్సెప్ట్ తో ఉంటుంది. మొదటి సినిమానే స్పెర్మ్ డోనర్ గా నటిస్తున్న గణేష్ ఏ స్టైల్ లో అలరిస్తాడో తెలియడం లేదు. తొలి సినిమానే ఇలాంటి కథాంశం ఎంచుకోవడం ఏంటీ స్వామి అని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఈ అలవాటు ఏంటి అంటూ కామెంట్ చేస్తున్నారు. కానీ సినిమా మాత్రం మస్త్ గా ఉందనే టాక్ వస్తోంది. ఆద్యంతం ఆకట్టుకునే చిత్రంగా ఉంటుందని చెబుతున్నారు. దీంతో భవిష్యత్ లో ఇంకా ఎలా తన పాత్రలు ఎంచుకుంటాడోననే అందరు ఆలోచిస్తున్నారు. సినిమా గురించి దర్శకుడు లక్ష్మణ్ కే కృష్ణ మాట్లాడుతూ సినిమా అందరిని మెప్పిస్తుందని ఆశిస్తున్నారు. తొలి సినిమానే ఇలాంటి కథాంశం ఎంచుకోవడం ఏంటీ స్వామి అని పలువురు కామెంట్ చేస్తున్నారు.