Jr NTR Devara : ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమాకు సంబంధించిన షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ అనేది ఎప్పుడు వస్తుంది అంటూ అభిమానులు విపరీతంగా ఎదురు చూస్తున్నారు. ఇక వాళ్ల నిరీక్షణకు తెర దించుతూ న్యూ ఇయర్ సందర్భంగా ఈ చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు.
ఈనెల 8వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన గ్లిమ్స్ ని రిలీజ్ చేసి సినిమా మీద అంచనాలు పెంచడానికి చూస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమా గ్లిమ్స్ ని ఎన్ని సెకండ్ల పాటు రిలీజ్ చేస్తారు అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో ప్రతి ఎపిసోడ్ ని కొరటాల శివ తో పాటు ఎన్టీఆర్ కూడా దగ్గరుండి చాలా జాగ్రత్తగా చూసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో ఒక ఫైట్ సీన్ ఈ సినిమా కి హైలెట్ కాబోతున్నట్టుగా కూడా సినిమా యూనిట్ నుంచి లీకేజీ లు అయితే అందుతున్నాయి.
అది ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్ లా మధ్య జరిగే ఒక భీకరమైన ఫైట్ సీన్ ఈ సినిమాకి హైలెట్ కాబోతున్నట్టుగా ఇప్పటినుంచే సినిమాకు సంబంధించిన లీకేజీలను వదులుతున్నారు.ఇది ఎంతవరకు నిజం అనేది క్లారిటీ లేదు కానీ వీళ్ళిద్దరి మధ్య ఫైట్ సీక్వెన్స్ అయితే ఉంది అనేది స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఫైట్ కి సంబంధించిన చిన్న షాట్స్ ని కూడా గ్లిమ్స్ లో వదలబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఈ సినిమాతో కనుక ఎన్టీఆర్ సక్సెస్ కొడితే వరుసగా తను ఏడవ విజయాన్ని అందుకున్న హీరోగా మంచి గుర్తింపు పొందుతాడు.
అలాగే రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఏ హీరో కూడా ఇప్పటివరకు సక్సెస్ కొట్టలేదు కాబట్టి ఎన్టీఆర్ ఈ సినిమాతో సక్సెస్ కొట్టి ఆ నమ్మకాన్ని బ్రేక్ చేస్తాడా అనేది చూడాలి. ఇక వీటన్నింటి మధ్య వస్తే గాని ఈ సినిమా ఎలా ఉండబోతుందో గ్లిమ్స్ చూస్తే గానీ ప్రేక్షకుడికి ఒక అంచన అయితే రాదు. ఇక గ్లిమ్స్ వచ్చిన తర్వాత ఈ సినిమా మీద ప్రేక్షకుల అంచనా మారబోతున్నట్టుగా తెలుస్తుంది…చూడాలి మరి ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుందో…