https://oktelugu.com/

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కు ఆస్తుల లెక్కతేలింది.. ఇంత సంపాదించాడా?

Sudigali Sudheer: ఒక మామూలు మెజిషీయన్ ఇప్పుడు తెలుగు బుల్లితెరపై ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి అద్భుతమైన కమెడియన్ గా మారాడు. హీరోగానూ ఎదిగాడు. ఈ ఎదుగుదల వెనుకాల సుడిగాలి సుధీర్ కష్టం ఎంతో ఉంది. ఇప్పుడు జబర్ధస్త్ కమెడియన్ గా.. యాంకర్ గా.. సినిమాల్లో హీరోగా సత్తా చాటుతున్న సుధీర్ జీరో నుంచి హీరోగా మారి ఇప్పుడు ఆస్తులు కూడా అలానే పెంచుకున్నాడు. నాలుగు రాళ్లు వెనకేసుకున్నాడు. జబర్ధస్త్ లో కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన సుధీర్ […]

Written By:
  • NARESH
  • , Updated On : August 25, 2021 / 04:09 PM IST
    Follow us on

    Sudigali Sudheer: ఒక మామూలు మెజిషీయన్ ఇప్పుడు తెలుగు బుల్లితెరపై ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి అద్భుతమైన కమెడియన్ గా మారాడు. హీరోగానూ ఎదిగాడు. ఈ ఎదుగుదల వెనుకాల సుడిగాలి సుధీర్ కష్టం ఎంతో ఉంది. ఇప్పుడు జబర్ధస్త్ కమెడియన్ గా.. యాంకర్ గా.. సినిమాల్లో హీరోగా సత్తా చాటుతున్న సుధీర్ జీరో నుంచి హీరోగా మారి ఇప్పుడు ఆస్తులు కూడా అలానే పెంచుకున్నాడు. నాలుగు రాళ్లు వెనకేసుకున్నాడు.

    జబర్ధస్త్ లో కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన సుధీర్ ఏడేళ్లుగా తెలుగు ప్రేక్షకులకు తనదైన టైమింగ్ కామెడీతో నవ్విస్తూనే ఉన్నాడు. ఈ మధ్య సాఫ్ట్ వేర్ సుధీర్ అనే సినిమా తీసి అలరించాడు. మిగిలిన సినిమాల్లోనూ చిన్న చిన్న పాత్రలు చేస్తూ అలరిస్తున్నాడు.

    ప్రస్తుతం బుల్లితెర అయినా వెండితెర అయినా సుడిగాలి సుధీర్ డేట్స్ హాట్కేక్.. 30 రోజులు బిజీగానే సుధీర్ గడుపుతుంటాడు. ఈ క్రమంలోనే రెమ్యూనరేషన్ కూడా బాగానే తీసుకుంటున్నాడు. ఏడేళ్లలో సుధీర్ బాగానే సంపాదించాడని హైదరాబాద్ లో ఆస్తులు కూడబెట్టారని చెబుతున్నారు.

    ప్రస్తుతం సుధీర్ ఆస్తి లెక్కలు కడితే ఇటీవలే హైదరాబాద్ లో ఓ ప్రాపర్టీ తీసుకున్నట్టు బుల్లితెర టాక్.. మొత్తం ఆస్తులు కలిపితే దాదాపు రూ.5 కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు. ఏడాదికి కనీసం 40 లక్షల వరకు సుధీర్ ఆదాయం ఉంటుందని.. ఈ సంపాదనతో హైదరాబాద్ లో ఆస్తులు కొనుగోలు చేస్తున్నాడట సుధీర్..తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీలో తన ఆస్తుల గురించి సుధీర్ నోరువిప్పాడు. హైదరాబాద్ లోనే ఇతడికి రెండు సొంతిళ్లు ఉన్నాయని షోలో తెలిసింది. సిటీలో ఒక్క ఇల్లు ఉండడమే కష్టం అనుకుంటే ఏకంగా రెండు సొంతిళ్లు కొన్న సుధీర్ ను అంతా గ్రేట్ అంటున్నారు. ఇవే కాదు స్థిరాస్థులు కూడా బాగానే కూడబెడుతున్నాడట..

    ఒకప్పుడు ఏమీ లేని చిన్న మెజిషీయన్ నుంచి ఈ ఏడేళ్లలో ఎంతో ఎత్తుకు ఎదిగిన సుధీర్ ను చూసి తోటి కమెడియన్స్ అంతా మెచ్చుకుంటున్నారట..