Rajamouli – Mahesh : రాజమౌళి డైరెక్షన్ లో సినిమాలు చేస్తే హీరో కి ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా మంచి గుర్తింపు అయితే వస్తుంది. కానీ ఆయన సినిమాలో నటించడం అంటే ఆర్టిస్ట్ కి చాలా ఇబ్బందులు ఉంటాయి బాహుబలి సినిమా షూటింగ్ టైమ్ లో ప్రభాస్ కి రెండు సార్లు షోల్డర్ ఇంజురీ అయింది.
అలాగే త్రిబుల్ ఆర్ సినిమా షూటింగ్ లో రామ్ చరణ్ కి కూడా ఇంజురీ అయింది. ఇలా ఆయన సినిమాలో చేయడం వల్ల రిస్క్ ఉంటుంది అలాగే ఆ రిస్క్ కి తగ్గట్టు గా గుర్తింపు కూడా వస్తుంది. ఇక ఇది ఇలా ఉంటే మహేష్ బాబు అభిమానులు మాత్రం ఇప్పుడు ఒక విషయం లో చాలా ఇబ్బంది పడుగ్లతున్నట్టు గా తెలుస్తుంది. అది ఏంటంటే రాజమౌళి తో సినిమా అంటే ఆయన ఒక్కో షాట్ ని ఒక్కో రోజు చేస్తూ ఆ సినిమాని చెక్కుతు ఉంటాడు. ఇక ఇలాంటి క్రమం లో ఆయనతో సినిమా చేసే హీరోల డేట్స్ దాదాపు 3 నుంచి 4 సంవత్సరాల వరకు ఆ సినిమా మీదనే కేటాయించాల్సి ఉంటుంది. ఇంతకు ముందు ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీయార్ లాంటి నటుల విషయం లో ఇదే జరిగింది.
కాబట్టి మహేష్ బాబు విషయం లో కూడా ఇదే రిపీట్ అవుతుంది. అందుకని మహేష్ బాబు అభిమానులు ఇక మనం ఈ గ్యాప్ లో మహేష్ బాబుని చూడలేమంటూ బాధపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు తెలుస్తున్న విషయం ఏంటి అంటే రాజమౌళి మహేష్ బాబు కాంబోలో వచ్చే సినిమా అడ్వెంచర్ జానర్ కి చెందినదిగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు తను కావాలనుకున్నది దక్కించుకోవడానికి అడ్వెంచర్స్ చేస్తూ ముందుకు సాగే పాత్రలో కనిపించబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఇప్పటివరకు తెలుగు లో అడ్వెంచర్ జానర్ లో అంజి, సాహసం, కార్తికేయ 2 లాంటి సినిమాలు వచ్చాయి. మరి అలాంటి జానర్ లోనే ఈ సినిమా కూడా తెరకెక్కుతుందనే వార్తలు అయితే వస్తున్నాయి. అయితే ఇలాంటి సినిమాని తెరకెక్కించాలంటే హీరో ఈ సినిమా కోసం చాలా రోజులు తన డేట్స్ ని కేటాయించాల్సి ఉంటుంది. అవన్నింటికి సిద్ధపడే మహేష్ బాబు రాజమౌళి కాంపౌండ్ లో అడుగు పెట్టినట్టు గా తెలుస్తుంది…ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ లో రిలీజ్ అవుతుంది కాబట్టి ఇప్పుడప్పుడే ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలైతె కనిపించడం లేదు…