Heroine – Politician Affair : గుసగుస: ఆ హీరోయిన్ కు రూ.7 కోట్ల ఫ్లాట్ గిఫ్ట్ గా ఇచ్చిన పొలిటీషియన్!.. ఏంటి కథ

Heroine – Politician Affair : రాజకీయాలకు సినిమాలకు చాలా దగ్గరి సంబంధం ఉంటుంది. మన అగ్రతారలు  రాజకీయాల్లోకి వచ్చి తమ అదృష్టం పరీక్షించుకుంటూనే ఉంటారు. సినిమా తారలతో రాజకీయ నేతల అనుబంధం ఇప్పటిది కాదు.. సీనియర్ ఎన్టీఆర్ నుంచే మొదలైంది. చాలా మంది సినీ తారలు ఇప్పుడు రాజకీయాల్లో రాణిస్తున్నారు. రాజకీయ నేతలు సినిమాలతో అనుబంధం కలిగి ఉన్నారు.నిర్మాతలుగానూ మారి సినిమాలు తీస్తున్నారు.  ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్న వారు హీరోయిన్లపై మనసు పారేసుకోవడం.. వారి కోరికలను […]

Written By: NARESH, Updated On : December 13, 2022 5:18 pm
Follow us on

Heroine – Politician Affair : రాజకీయాలకు సినిమాలకు చాలా దగ్గరి సంబంధం ఉంటుంది. మన అగ్రతారలు  రాజకీయాల్లోకి వచ్చి తమ అదృష్టం పరీక్షించుకుంటూనే ఉంటారు. సినిమా తారలతో రాజకీయ నేతల అనుబంధం ఇప్పటిది కాదు.. సీనియర్ ఎన్టీఆర్ నుంచే మొదలైంది. చాలా మంది సినీ తారలు ఇప్పుడు రాజకీయాల్లో రాణిస్తున్నారు. రాజకీయ నేతలు సినిమాలతో అనుబంధం కలిగి ఉన్నారు.నిర్మాతలుగానూ మారి సినిమాలు తీస్తున్నారు.  ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్న వారు హీరోయిన్లపై మనసు పారేసుకోవడం.. వారి కోరికలను హీరోయిన్లతో తీర్చుకున్న ఉదంతాలు కోకొల్లలు..

సహజంగా ముంబై, ఢిల్లీ, ఉత్తరాది నుంచి వచ్చిన హీరోయిన్లనే నిర్మాతలు, దర్శకులు ఎక్కువగా తీసుకుంటారు. ఎందుకంటే వారు దేనికి నో చెప్పారు. కమిట్ మెంట్లకు అంగీకరిస్తారన్న ప్రచారం ఉంది. తెలుగువాళ్లు, దక్షిణాది హీరోయిన్లు ఇందుకు అంగీకరించరు కాబట్టే వారికి చాన్సులు రావు.. హీరోయిన్లుగా సెటిల్ కారన్న ప్రచారం ఉంది.

అయితే ఇండస్ట్రీలో సైతం తెలుగు హీరోయిన్లను అస్సలు పట్టించుకోరు. కొత్తగా వచ్చే తెలుగు అమ్మాయిలను హీరోయిన్లుగా తీసుకోవడానికి దర్శక నిర్మాతలు ఇష్టపడరు. కానీ ఈ తెలుగు హీరోయిన్ మాత్రం అందరికంటే భిన్నంగా మంచి అవకాశాలు దక్కించుకుంటోంది. ఒకటి రెండు హిట్స్ మాత్రమే కొట్టి పద్ధతిగల హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈమెకు ప్రస్తుతానికి అవకాశాలు లేవు. ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు.

అయితే ఓ రాజకీయ నాయకుడితో ఈమె సన్నిహితంగా మెలుగుతోందని.. అతడు క్యాసినోలతో భారీగా సంపాదించాడని ప్రచారం ఉంది. వందల కోట్లు సంపాదించిన ఈ పొలిటీషియన్ తో ఈ తెలుగు హీరోయిన్ టచ్ లో ఉందని.. ఇటీవలే ఈమెకు హైదరాబాద్ లోని ఓ ఖరీదైన గేటెడ్ కమ్యూనిటీలో ఏకంగా రూ.7 కోట్లతో విలాసవంతమైన ఫ్లాట్ ను గిఫ్ట్ గా ఇచ్చాడట.. ఈ తెలుగు హీరోయిన్ ఇప్పుడు అందులోనే నివాసం ఉంటోంది.

కనీసం 20 నుంచి 30 లక్షలు కూడా సినిమాకు అందుకోని ఈ హీరోయిన్ ఏకంగా 7 కోట్ల ఫ్లాట్ లో విలాసవంతంగా గడపడం వెనుక ఆ పొలిటీషియన్ ఉన్నాడని.. అతడికి ఆమె అన్ని విధాలుగా సహకరించబట్టే ఇలా కోటీశ్వరురాలు అయిపోయిందని ఇండస్ట్రీలో గుసగుసలు నడుస్తున్నాయి. సినిమాల ద్వారా ఏమీ సంపాదించలేని ఈ హీరోయిన్ ఇప్పుడు 7 కోట్ల ఫ్లాట్ కు ఓనర్ అయిపోయిందని కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. ఇక అంతేకాదు.. తన ప్రియమైన హీరోయిన్ కు హీరోయిన్లుగా సినిమాల్లో ఛాన్సులు కూడా ఇవ్వాలంటూ ఆ పొలిటీషియన్ ఫోన్లు చేసి మరీ దర్శకనిర్మాతలకు రికమండ్ చేస్తున్నాడట.. ఇలా ఆ రాజకీయ నేత దెబ్బకు ఆ హీరోయిన్ దశ మారిపోయిందంటున్నారు.