spot_img
Homeఎంటర్టైన్మెంట్Megastar Chiranjeevi: చిరంజీవి ముందు మేము చాలా తక్కువ అంటున్న తమిళ్ స్టార్ హీరోలు... ఎందుకిలా...

Megastar Chiranjeevi: చిరంజీవి ముందు మేము చాలా తక్కువ అంటున్న తమిళ్ స్టార్ హీరోలు… ఎందుకిలా అన్నారంటే..?

Megastar Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతిని పెంచిన వారిలో మెగాస్టార్ చిరంజీవి కీలక పాత్ర వహించాడు. సీనియర్ ఎన్టీఆర్ లాంటి నటుడు ఒక స్థాయి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ తీసుకెళ్తే దానిని అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్లిన ఘనత మెగాస్టార్ కే దక్కుతుంది. అలాంటి చిరంజీవి ప్రస్తుతం 70 సంవత్సరాల వయసులో కూడా సినిమాలను చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు తను ఏదైతే చేయాలి అనుకుంటున్నాడో ఆ సినిమాలను విజయవంతమైన సినిమాలను చేయడంలో ఆయన ఎప్పుడు సక్సెస్ అవుతూనే ఉన్నాడు. ఇలాంటి మెగాస్టార్ ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా ఆచితూచి ముందుకు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది…ఇక సౌత్ సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ నెంబర్ వన్ స్థానంలో ఉంటాడని చాలాసార్లు చెప్పిన కూడా కొంతమంది నమ్మడం లేదు.

Also Read: వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ‘అల్లు సినిమాస్’..తెలుగు వాళ్లంటే అంత చులకనా?

నిజానికి ఒక ఈవెంట్ లో చిరంజీవి స్క్రీన్ కి స్టైల్ అంటే ఏంటో నేర్పిన నటుడు రజినీకాంత్, నటన అంటే ఏంటో చూపించిన నటుడు కమల్ హాసన్ అంటూ వాళ్ల గురించి మాట్లాడుతూ ఉంటే వెంటనే రజినీకాంత్ మైక్ తీసుకొని ఒక రజనీకాంత్, కమల్ హాసన్ కలిస్తే మెగాస్టార్ చిరంజీవి అంటూ చాలా గర్వంగా చెప్పాడు.

దానికి చిరంజీవి సైతం ఏం మాట్లాడలేకపోయాడు. స్టార్ హీరోలు, సూపర్ స్టార్లు సైతం చిరంజీవి టాప్ పొజిషన్ లో ఉన్నాడని పొగుడుతుంటే మనవాళ్లు మాత్రం దాన్ని జీర్ణించుకోవడం లేదు. ఇక ఏది ఏమైనా కూడా ఆయన క్రేజ్ సౌత్ ఇండియాలో టాప్ లో ఉందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు. అప్పట్లో తన నుంచి వచ్చిన ప్రతి సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేది.

అందుకే ప్రేక్షకులందరు కలిసి అతన్ని టాప్ హీరోగా నిల్చోబెట్టారు. మరి అలాంటి స్టార్ హీరో ఇప్పుడు చేస్తున్న సినిమాలతో కూడా తన మార్కును చూపించుకోవాలి అనుకుంటున్నాడంటే ఆయన సినిమా కోసం ఎంతలా కష్టపడుతున్నాడో ఎప్పటికప్పుడు తనను తాను ప్రూవ్ చేసుకోవాలనే ఒక తపన అతనిలో ఎంతలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular