Tamannaah Bhatia: సౌత్ ఇండియా లో ఒక స్టార్ హీరో కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్న హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో తమన్నా కచ్చితంగా ముందు వరుసలో ఉంటుంది. కేవలం అందంతోనే కాదు, అద్భుతమైన అభినయం, డ్యాన్స్ తో యూత్ మరియు మాస్ ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోయిన్ ఆమె. అందుకే ఎంత మంది కొత్త హీరోయిన్స్ వచ్చినా కూడా తమన్నా కి ఇసుమంత క్రేజ్ కూడా తగ్గలేదు. ఇప్పటికీ ఆమె పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు చేస్తూ ఫుల్ డిమాండ్ తోనే కొనసాగుతుంది. అయితే ఈమధ్య కాలం లో కొన్ని హిందీ సినిమాల్లో తమన్నా రొమాంటిక్ సన్నివేశాలు హద్దులు దాటి చేయడాన్ని మనమంతా చూసాము. చిన్న ముద్దు సన్నివేశాల్లో నటించడానికే ఇష్టం చూపని తమన్నా ఈ రేంజ్ హాట్ సన్నివేశాల్లో నటించడం ఏంటి అంటూ ప్రతీ ఒక్కరు ఆశ్చర్యపోయారు.
ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా తమన్నా తన కెరీర్ లో ఎదురైనా కొన్ని సంఘటనల గురించి చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ ‘ఒక సీనియర్ స్టార్ హీరో తో రొమాన్స్ చెయ్యాలని ఒక డైరెక్టర్ కోరితే నాకు కంఫర్ట్ లేకపోవడంతో నో చెప్పాను. దాంతో ఆ డైరెక్టర్ కి కోపం వచ్చి, ఆ సమయం లో పెద్దగా అరుస్తూ, హీరోయిన్ ని మార్చాలంటూ నాపై ఒత్తిడి చేసే ప్రయత్నం చేసాడు. అయినప్పటికీ నేను తగ్గలేదు, రొమాన్స్ కి కంఫర్ట్ లేదు, చేయనంటే చెయ్యను అనే చెప్పాను. చివరికి ఏమైందో ఏమో తెలియదు కానీ, ఆ డైరెక్టర్ తగ్గి, నా వద్దకు వచ్చి క్షమాపణలు చెప్పాడు. ఆ సినిమా పూర్తి చేసాను’ అంటూ చెప్పుకొచ్చింది తమన్నా. ఇది కచ్చితంగా ఆమె స్టార్ హీరోయిన్ అయినప్పుడు జరిగింది కాదు, కెరీర్ ప్రారంభం లో జరిగిన సంఘటన అయ్యుంటుందని అంటున్నారు విశ్లేషకులు.
తమన్నా కెరీర్ ప్రారంభం లో కూడా రొమాంటిక్ సన్నివేశాల్లో పెద్దగా నటించేది కాదు. ముద్దు సన్నివేశాల్లో ఈమె అంత చెత్తగా ఇండియా లో హీరోయిన్ కూడా చేయదు అని చెప్పొచ్చు. అలాంటి తమన్నా, ఇప్పుడు బాలీవుడ్ లో చేస్తున్న అడల్ట్ కంటెంట్ సినిమాలను చూసి ఆమె అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. మారుతున్న ట్రెండ్ ని బట్టీ మనం కూడా మారాలి, ఇప్పుడు యూత్ ఆడియన్స్ ఇలాంటివి కోరుకుంటున్నప్పుడు, మన కెరీర్ ముందుకు సాగాలంటే ఇలాంటివి చేయక తప్పదు అంటూ తమన్నా రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది. ఇకపోతే తెలుగు లో చివరిసారిగా వెండితెర పై కనిపించిన చిత్రం ‘ఓదెల 2’. సంపత్ నంది దర్శకత్వం లో గత ఏడాది విడుదలైన ఈ చిత్రం కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యిది.