Ram Charan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీ విని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధిస్తున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా రామ్ చరణ్ లాంటి నటుడు మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీకి వచ్చినా కూడా తండ్రికి తగ్గ తనయుడిగా ఎదిగాడు. మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. పాన్ ఇండియాలో సైతం తనకంటూ గొప్ప క్రేజ్ ను ఎంచుకున్న రామ్ చరణ్ ఇకమీదట చేయబోయే సినిమాల విషయంలో చాలా క్లారిటిని మెయింటైన్ చేస్తున్నాడు. ఇక ఇప్పటికే సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి కమిట్ అయిన ఆయన ఇప్పుడు చేయబోయే సినిమాల విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉండటం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక ఇంతకుముందు ఆయన చేసిన పెద్ది సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా క్లారిటీని మెయింటైన్ చేయాల్సిన అవసరమైతే ఉందని అతని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.
త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత ఆచార్య, గేమ్ చేంజర్, పెద్ది లాంటి సినిమాలు అతనికి ఏ మాత్రం సక్సెస్ ని సాధించి పెట్టలేదు. దాంతో ఆయన చాలావరకు డీలా పడిపోయాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో ఇంకాస్త కేర్ ఫుల్ గా వ్యవహరించాల్సిన అవసరమైతే ఉందని సినిమా విమర్శకులు సైతం కామెంట్లు చేస్తున్నారు.
ఇక సుకుమార్ ప్రస్తుతం సినిమా స్టోరీ రాసే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ స్టోరీ విషయంలోనే ఆయన చాలా క్లారిటిని మెయింటైన్ చేయాలని చూస్తున్నాడు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే దాన్ని సీన్ గా రాయాలని చూస్తున్నాడు. అప్పటివరకు ఎలాంటి కన్ఫ్యూజన్స్ లేకుండా కథ మీదే ఫుల్ ఫోకస్డ్ గా ముందుకు సాగాలని చూస్తున్నాడు. కథ ఎప్పుడు ఫైనల్ అయితే అప్పుడు సినిమాను సెట్స్ మీదకి తీసుకువెళ్లాలి.
అంతే తప్ప ఎలాంటి టార్గెట్ పెట్టుకొని ఇన్ని రోజుల్లోనే కథను పూర్తి చేయాలనేది ఏమీ చేయడం లేదట. దానివల్ల కథ ఫాస్ట్ ఫాస్ట్ గా చుట్టేసే అవకాశం ఉంది. కాబట్టి కథ బాగా కుదిరిన తర్వాతే సెట్స్ మీదకి వెళ్దాం అని రామ్ చరణ్ తో చెప్పాడు. మొత్తానికైతే ఈ సినిమాతో రంగస్థలం మూవీకి మించి సక్సెస్ సాధించాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది…
