https://oktelugu.com/

అల్లు అర్జున్ కోసం కాస్లీ ఐటెమ్ గర్ల్ ను తెప్పిస్తున్న సుకుమార్..

ఆర్య2లో రింగా రింగా నుంచి రంగస్థలం మూవీలో జిగేల్ రాణి దాకా టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ ఐటెం సాంగ్ లు తెలుగు జనాలను ఓ ఊపు ఊపేశాయి. ఇప్పుడు అల్లు అర్జున్ హీరోగా సుకమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పుష్ప’ సినిమా కోసం కూడా సుకుమార్ మంచి ఐటెమ్ పాట ను సంగీత దర్శకుడు దేవీశ్రీతో రెడీ చేయిస్తున్నాడట.. అది వింటేనే గూస్ బాంబ్స్ వచ్చి ముసలి ముతకా అంతా కలిసి చిందులేసేలా ట్యూన్ చేస్తున్నారట.. Also […]

Written By:
  • NARESH
  • , Updated On : January 2, 2021 / 03:42 PM IST
    Follow us on

    ఆర్య2లో రింగా రింగా నుంచి రంగస్థలం మూవీలో జిగేల్ రాణి దాకా టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ ఐటెం సాంగ్ లు తెలుగు జనాలను ఓ ఊపు ఊపేశాయి. ఇప్పుడు అల్లు అర్జున్ హీరోగా సుకమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పుష్ప’ సినిమా కోసం కూడా సుకుమార్ మంచి ఐటెమ్ పాట ను సంగీత దర్శకుడు దేవీశ్రీతో రెడీ చేయిస్తున్నాడట.. అది వింటేనే గూస్ బాంబ్స్ వచ్చి ముసలి ముతకా అంతా కలిసి చిందులేసేలా ట్యూన్ చేస్తున్నారట..

    Also Read: అనసూయ విరహ వేదన మామూలుగా లేదే?

    మాస్ పాటలంటేనే చెవికోసుకునే టాప్ డైరెక్టర్ సుకుమార్ మాత్రం తన సినిమాలో దేవీశ్రీ ప్రసాద్ తో కలిసి ఒక మంచి మసాలా మాస్ సాంగ్ ను ప్రతి సినిమాలో పెట్టిస్తుంటాడు. వీరి కాంబినేషన్ లో వచ్చిన ఐటెమ్ సాంగ్ లన్నీ సూపర్ డూపర్ హిట్స్.

    ఇక పాటతోనే ఆ ఊపును ఆపడం లేదు.. బాలీవుడ్ లోనే క్రేజీ హీరోయిన్ ను ఈ పాటలో అల్లు అర్జున్ తో కలిసి డ్యాన్స్ చేయించేందుకు సుకుమార్ ప్రయత్నాలు చేస్తున్నారట.. ఇక ఈ ఐటెం సాంగ్ లో ఆడిపాడేందుకు ఏకంగా కోటికి పైగా పారితోషికం ఇచ్చి అత్యంత కాస్ట్ లీ ఐటెం గర్ల్ ను రప్పిస్తున్నారట.. ఒక్క ఐటెం సాంగ్ కోసం ఏకంగా కోటిరూపాయల పారితోషకం వసూలు చేసే ఆ బ్యూటీ ఎవరో కాదు.. ‘లోఫర్’ సినిమాలో నటించి బాలీవుడ్ క్రేజ్ హీరోయిన్ గా మారిన ‘దిశా పటానీ’. జిగేల్ రాణి పాటకు మించి దీన్నీ రూపొందిస్తున్నట్టు టాక్.

    Also Read: సౌత్ ఇండియాలోనే అత్యధిక రెమ్యూనరేషన్ సూర్యకే?

    టాలీవుడ్ మూవీల్లో ఈ ఐటెమ్ సాంగ్ లకు పిచ్చ క్రేజ్ ఉంది. అగ్ర హీరోలందరూ తమ సినిమాల్లో ఒక్క ఐటెమ్ సాంగ్ అయినా పెట్టుకుంటారు. కత్తిలాంటి హీరోయిన్లను ఐటెమ్ గర్ల్ గా మార్చి వారితో చిందులేస్తారు. ఇప్పుడు అల్లు అర్జున్ మూవీ కోసం కూడా ఐటెం సాంగ్ రెడీ అవుతోంది. దీనికి ఎంతైనా ఖర్చు పెట్టేందుకు సుకుమార్ వెనుకాడడం లేదట..

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్