ఏపీలో మరో ఆరు నెలలు ‘స్పెషల్‌’ పాలన

గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏపీలో స్థానిక ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఆ ఎన్నికలు నిర్వహించలేదు. దీంతో స్థానిక సంస్థల పాలన కోసం ప్రత్యేక అధికారులను నియమించారు. ఏడాదిన్నరగా పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లు ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలోనే నడుస్తున్నాయి. వారి ఆధ్వర్యంలోనే కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. Also Read: దేశమంతా కరోనా టీకా ఫ్రీ అయితే.. ఇప్పటివరకు స్థానిక సంస్థల ఎన్నికలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో […]

Written By: Srinivas, Updated On : January 2, 2021 3:48 pm
Follow us on


గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏపీలో స్థానిక ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఆ ఎన్నికలు నిర్వహించలేదు. దీంతో స్థానిక సంస్థల పాలన కోసం ప్రత్యేక అధికారులను నియమించారు. ఏడాదిన్నరగా పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లు ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలోనే నడుస్తున్నాయి. వారి ఆధ్వర్యంలోనే కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.

Also Read: దేశమంతా కరోనా టీకా ఫ్రీ

అయితే.. ఇప్పటివరకు స్థానిక సంస్థల ఎన్నికలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జిల్లా పరిషత్, మండల పరిషత్ లలో ప్రత్యేక అధికారుల పాలనను ఆరు నెలల పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేదీ పేరుతో జారీ అయిన ఉత్తర్వుల్లో జిల్లా పరిషత్ లలో జనవరి 5 నుంచి, మండల పరిషత్ లలో జనవరి 4 నుంచి ప్రత్యేక అధికారుల పాలన పొడిగింపు ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ప్రభుత్వానికి మధ్య వివాదం నడుస్తున్న నేపథ్యంలో ప్రత్యేక అధికారుల పాలన పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశమైంది.

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు టీడీపీ ప్రభుత్వ హయాంలోనే జరగాల్సి ఉంది. అయితే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేసింది. స్థానిక సంస్థల పాలనను ప్రత్యేక అధికారులకు అప్పగిస్తూ అప్పటి ప్రభుత్వం జీవో జారీ చేసింది. అప్పటి నుంచి ప్రతి ఆరు నెలలకోసారి ప్రత్యేక అధికారుల పాలన పొడిగిస్తూ వచ్చింది. తాజాగా.. వైసీపీ ప్రభుత్వం కూడా ఆ ఉత్తర్వులను పొడిగించింది. ఈనెల 4,5 తేదీల్లో మండల పరిషత్, జిల్లా పరిషత్‌లలో ప్రత్యేక అధికారుల పాలన ముగుస్తుండటంతో మరోసారి జీవో జారీ చేసింది.

Also Read: పల్లెల నుంచే ఐటీ సేవలు

వాస్తవానికి గతేడాది స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. అయితే.. కరోనా పరిస్థితుల కారణంగా ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించడంతో వివాదం రేగింది. ఈ అంశంపైనే కొన్నాళ్లుగా వైసీపీ ప్రభుత్వానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు మధ్య యుద్ధం నడుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో అటు ప్రభుత్వం-ఇటు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోర్టుల్లో పోరాడుతున్నారు. ఈ ఏడాది మార్చిలో తమను సంప్రదించకుండానే ఎన్నికలు వాయిదా వేయడంపై ప్రభుత్వం మండిపడింది. ఆ తర్వాత ఎస్ఈసీ పదవీకాలాన్ని తగ్గిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావడం.. దీనిపై కోర్టులో నిమ్మగడ్డ గెలవడం.. మళ్లీ బాధ్యతలు తీసుకోవడం జరిగిపోయాయి.

అయితే.. నిమ్మగడ్డ రీఎంట్రీ తర్వాత స్థానిక ఎన్నికలే కేంద్రంగా మరోసారి యుద్ధం మొదలైంది. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తానని ఎస్ఈసీ ప్రకటించారు. దీనిపై ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఎన్నికల ప్రొసీడింగ్స్ పై స్టే ఇవ్వాలని హై కోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై విచారణ జరుగుతుండగానే ఎన్నికలు నిర్వహించకూడదంటూ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం కూడా చేసింది. వెంటనే ప్రభుత్వ ఆర్డినెన్స్ వస్తే ఆమోదించవద్దంటూ ఎస్ఈసీ గవర్నర్ కు లేఖ రాశారు. ఇదిలా ఉండగా.. స్థానిక సంస్థల ఎన్నికలపై వైసీపీ ప్రభుత్వం పట్టువీడటం లేదు. నిమ్మగడ్డ ఎస్ఈసీగా ఉండగా ఎన్నికలు నిర్వహించకూడదని గట్టిగా భావిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి, ఎస్‌ఈసీతో చర్చించి స్థానిక ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సూచించింది. ఈ రచ్చ ఇలా నడుస్తుండగానే ప్రభుత్వం ప్రత్యేక అధికారుల పాలనను పొడిగిస్తూ జీవో ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్