Sudigali Sudheer Emotional In Aata Dance Show: ప్రతీ శని, ఆదివారాల్లో జీ తెలుగు ఛానల్ లో ప్రసారమయ్యే ఆట డ్యాన్స్ రియాలిటీ షో ఎంత బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆడిషన్స్ ద్వారా ఎంపిక కాబడిన ఈ కంటెస్టెంట్స్ వేసే డ్యాన్స్ చూస్తే ఎలాంటి వారికైనా మతి పోవాల్సిందే. అసలు వీళ్ళు మనుషులేనా, వీళ్ళ శరీరాల్లో ఎముకలు ఉన్నాయా అని ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది. ఈ డ్యాన్స్ రియాలిటీ షో కి మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కొణిదెల నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె కెరీర్ లో భారీ లాభాలను తెచ్చిపెడుతున్న మరో క్రేజ్ ప్రాజెక్ట్ ఇది. ఈ షోకి సుడిగాలి సుధీర్ హోస్ట్ గా వ్యవహరిస్తుండగా, నిహారిక, సీనియర్ హీరోయిన్ రాధికా, రఘు మాస్టర్ తదితరులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరిసున్నారు. అదే విధంగా కావ్య, విష్ణుప్రియా, సమీరా భరద్వాజ్, వంశి వంటి వారు ప్లేయర్స్ గా వ్యవహరిస్తున్నారు. అంటే టీం లీడర్స్ లాగా అన్నమాట.
ఈ వారం ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ని నేడు విడుదల చేయగా , అది బాగా వైరల్ అయ్యింది. అందులో తనుశ్రీ అనే కంటెస్టెంట్ వేసిన డ్యాన్స్ పెర్ఫార్మన్స్ కి సుడిగాలి సుధీర్ కంటతడి పెట్టుకుంటాడు. ఈ డ్యాన్స్ లో తనుశ్రీ తన పంపుదు కుక్కతో ఉన్న అనుబంధాన్ని , దాంతో ఉన్న ఎమోషన్ ని డ్యాన్స్ రూపం లో చూపించింది. పెర్ఫార్మన్స్ అయిపోయిన తర్వాత స్టేజి మీదకు వచ్చిన సుధీర్, ఈ పెర్ఫార్మన్స్ చూస్తున్నప్పుడు నాకు మా ఆస్కార్ (కుక్క పిల్ల) గుర్తుకొచ్చింది. ఇప్పుడు అది మీతో లేదా అని కావ్య సుధీర్ ని అడగడంతో , దానికి సుధీర్ సమాధానం చెప్తూ ‘ఇప్పుడు లేదు.. చనిపోయింది.. ఒక అరుదైన జ్వరం వచ్చింది. హాస్పిటల్ లో చేర్పించాము. రెండు రోజుల తర్వాత డాక్టర్లు చనిపోయింది అని మాకు చెప్పారు. ఇప్పటికీ అది లేని లోటు మా ఇంట్లో కనిపిస్తూనే ఉంది. గుండెల్లో ఎదో తెలియని బాధ ఇప్పటికీ ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు. ఎప్పుడు సరదాగా అందరినీ నవ్విస్తూ కామెడీ చేసే సుడిగాలి సుధీర్ నుండి ఇలాంటి ఎమోషనల్ కామెంట్స్ చూడడం అభిమానులు తీసుకోలేకపోతున్నారు. సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్న ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి.
