Tollywood Big Producer : టాలీవుడ్ లోనే ఆయన బడా నిర్మాత.. ఉన్న నాలుగు స్తంభాల్లో ఒకరు. 2004కు ముందు చంద్రబాబు నాయుడు హయాంలో ఆయనకు విశాఖ బీచ్ సమీపంలోని ప్రధాన కొండ ప్రాంతంలో సుమారు 35 ఎకరాల భూమిని సినీ స్టూడియో కోసం కొన్నారు. కోట్ల విలువ చేసే భూమిని ఎకరం రూ. 25 లక్షల అతి తక్కువ ధరకు చంద్రబాబు ప్రభుత్వం కట్టబెట్టింది. టాలీవుడ్ ను విశాఖకు తీసుకురావాలనే తలంపుతో చంద్రబాబు ప్రభుత్వం ఈ పందేరం చేసింది. ఖరీదైన భూములు చౌకగా రావడంతో ఆ బడా నిర్మాత కొనేశాడు. కట్ చేస్తే..
చంద్రబాబు నాయుడు హయాంలో విశాఖపట్నంలో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందలేదు. ఆ బడా నిర్మాత స్టూడియోను ప్రారంభించలేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం వరకు స్టూడియో కట్టలేదు. అయితే ఆ భూముల్లో అనేక సినిమా షూట్‌లు జరుగుతున్నప్పటికీ, స్టూడియో విస్తరణ, అభివృద్ధిలో పెద్దగా పురోగతి లేదు.
ఇక ఈ భూములకు పన్నులు కట్టలేదు ఆ బడా నిర్మాత.. స్టూడియో కోసం కేటాయించిన ఖాళీగా ఉన్న భూములకు 2012 నుండి ఒక కోటి రూపాయల కంటే ఎక్కువ మొత్తంలో పన్ను బకాయిపడింది. ఇప్పటివరకూ చెల్లించలేదని తేలింది. అనేక వందల కోట్ల రూపాయల టర్నోవర్ కలిగిన ఈ సంస్థ, దశాబ్ద కాలంలో కేవలం ఒక కోటి రూపాయల పన్ను మొత్తాన్ని చెల్లించకుండా నిర్లక్ష్యం చేసింది. అధికారులు దీనిని పట్టించుకోలేదు.
2012 నుండి స్టూడియోకి పన్ను సవరణ లేకపోవడం గమనార్హం. సాధారణ పౌరుల నుంచి ముక్కుపిండి వసూలు చేసే అధికారులు ఇంత ఖరీదైన భూములకు పన్ను వసూలు చేయకపోవడం విస్తుగొలుపుతోంది. 2012 మరియు 2019 మధ్య పన్ను సవరణ చేయలేదు.
కంపెనీ విస్తారమైన సంపద, టర్నోవర్‌లు కలిగి ఉంది. ఈ స్టూడియో అధినేతలు అయిన నిర్మాత, ఇద్దరు స్టార్‌లు కోట్లలో కార్యకలాపాలు కొనసాగిస్తారు. కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటారు. అయినా కూడా పన్ను కట్టకుండా స్టూడియో పెట్టకుండా ఈ ఖరీదైన భూములను సాంతం నాకేశారన్న ఆరోపణలు వస్తున్నాయి..