SSMB29 Movie Update: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న డైరెక్టర్ రాజమౌళి(Rajamouli)…ప్రస్తుతం ఆయన మహేష్ బాబు(Mahesh Babu) తో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. తన ఎంటైర్ కెరియర్ లో చేసిన సినిమాలన్నీ సూపర్ డూపర్ సక్సెస్ గా నిలవడంతో రాజమౌళికి సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనే గుర్తింపు కూడా వచ్చింది. 100% సక్సెస్ కలిగిన ఏకై దర్శకుడు కూడా తనే కావడం విశేషం… ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్ని గొప్ప గుర్తింపును సంపాదిస్తూ ఆయన్ని ముందుకు తీసుకెళుతున్నాయి. ప్రస్తుతం మహేష్ బాబుతో చేస్తున్న సినిమా అడ్వెంచర్ జానర్ లో తెరకెక్కబోతోంది. ఇండియానా జోన్స్ (Indiana Jones) లాంటి సినిమాల స్ఫూర్తితో ఈ కథను రాసినట్టుగా ఈ సినిమా కథ రచయిత అయిన విజయేంద్ర ప్రసాద్(Vijayendra Prasad) గతంలో తెలియజేశారు. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా మొత్తం ఆఫ్రికన్ అడవుల్లో సాగబోతుందట. ఒక నిధి కోసం వేట సాగించే హీరో ఫైనల్ గా దాన్ని దక్కించుకున్నాడా? లేదా అనే ఒక పాయింట్ తో ఈ సినిమాను తిరిగి తెరకెక్కిస్తున్నారు. మరి మొత్తానికైతే రాజమౌళి ఈ సినిమాని విజువల్ వండర్ గా తిరికెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాలో ఐటెం సాంగ్ కి స్కోప్ అయితే లేదట.
Also Read: ‘నీ అబ్బా’ అంటూ యాంకర్ ప్రదీప్ పై రెచ్చిపోయిన నిహారిక కొణిదెల!
రాజమౌళి సినిమాల్లో ఐటెం సాంగ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. వాటి ద్వారా ప్రేక్షకులను అలరించాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు.ఐటెం సాంగ్స్ పెట్టడం వల్లే మాస్ ప్రేక్షకుల్లో ఆయన సినిమాలకు ఎక్కువ ఆదరణ దక్కుతుందని ఇంపాక్ట్ కలిగి కొంతమంది రాజమౌళి గురించి చెబుతూ ఉంటారు. మరి ఈ సినిమాలో మాత్రం ఐటెం సాంగ్ పెట్టడానికి అవకాశం అయితే లేదట…
ఒక రకంగా చెప్పాలంటే ఐటెం సాంగ్ లేకపోయిన మహేష్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్ తో విజువల్ వండర్ ని క్రియేట్ చేసి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకోవడానికి రెడీ అవుతున్నాడు. మరి ఏది ఏమైనా కూడా రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ పాన్ వరల్డ్ లోకి ఎంటర్ అవ్వడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఆయన వెనకాలే మన దర్శకులు హీరోలు అందరూ పాన్ వరల్డ్ సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.
Also Read: మహేష్ బాబు ‘హరి హర వీరమల్లు’ కథని రిజెక్ట్ చేయడానికి కారణం అదేనా!
అయితే మహేష బాబు సినిమా కోసం దాదాపు 1200 కోట్ల బడ్జెట్ ను కేటాయిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్న రాజమౌళి తనకంటూ ఒక గొప్ప ఐడెంటిటిని సంపాదించుకుంటాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…