https://oktelugu.com/

కాంగ్రెస్‌కు సోనియా రిపేర్‌.. టీపీసీసీ రేవంత్ రెడ్డికే?‌

పార్టీలో అంతర్గత కుమ్ములాటలు.. బలమైన నాయకత్వం లేకపోవడం.. సీనియర్లు వర్సెస్‌ జూనియర్‌‌ రాజకీయాలు.. ఇవీ ఇప్పుడు ఢిల్లీ కాంగ్రెస్‌లో కనిపిస్తున్న పరిస్థితులు. దీంతో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ పార్టీని రిపేర్‌‌ చేసే పనిలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా పార్టీలో కొద్ది రోజుల క్రితమే సోనియా పలు మార్పులు చేసింది. తాజాగా ‘పరిస్థితులకు అనుగుణంగా’ పార్టీలో మరోసారి మార్పులు చేర్పులకు సిద్ధపడినట్లు ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీకి చెందిన అన్ని విభాగాల్లోనూ కొత్త వారికి అవకాశం […]

Written By:
  • NARESH
  • , Updated On : October 22, 2020 / 06:26 PM IST
    Follow us on

    పార్టీలో అంతర్గత కుమ్ములాటలు.. బలమైన నాయకత్వం లేకపోవడం.. సీనియర్లు వర్సెస్‌ జూనియర్‌‌ రాజకీయాలు.. ఇవీ ఇప్పుడు ఢిల్లీ కాంగ్రెస్‌లో కనిపిస్తున్న పరిస్థితులు. దీంతో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ పార్టీని రిపేర్‌‌ చేసే పనిలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది.

    ఇందులో భాగంగా పార్టీలో కొద్ది రోజుల క్రితమే సోనియా పలు మార్పులు చేసింది. తాజాగా ‘పరిస్థితులకు అనుగుణంగా’ పార్టీలో మరోసారి మార్పులు చేర్పులకు సిద్ధపడినట్లు ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీకి చెందిన అన్ని విభాగాల్లోనూ కొత్త వారికి అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సోనియా ఈ జాబితాను రెడీ చేసినట్లుగా పలువురు చెబుతున్నారు. బిహార్ ఎన్నికలు ముగియగానే ఈ మార్పులను అమలు చేయాలని నిర్ణయించుకున్నట్లు కూడా సమాచారం.

    Also Read: బీజేపీ వరం: ఎన్డీయే అధికారంలోకి వస్తే ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌

    అందులో భాగంగా ముఖ్యంగా ఆయా రాష్ట్రాల ఇన్‌చార్జీలను మార్చే ప్రయత్నం చేస్తున్నారట. ముఖ్యంగా ఢిల్లీ, గోవా ఇన్‌చార్జీలను మారుస్తున్నట్లు ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. వీటితో పాటు ఆయా అనుబంధ విభాగాల బాధ్యులను కూడా మార్చాలని సోనియా డిసైడ్‌ అయ్యారని టాక్‌.

    మరోవైపు.. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా అభ్యర్థులను ఖరారు చేసేందుకు ఏర్పాటు చేసిన కేంద్ర ఎన్నికల కమిటీని మరింత బలోపేతం చేయాలనుకుంటున్నట్లు తెలిసింది. సోనియా ఎప్పటి నుంచో పునరుద్ధరించాలని భావిస్తున్నా.. వివిధ కారణాల రీత్యా వాయిదా పడుతూ వచ్చింది. బిహార్ ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ ప్రక్రియను మొదలు పెట్టబోతున్నారు. వీటితోపాటు వివిధ రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికలపై కూడా సోనియా దృష్టి సారించారు.

    ఇక త్వరలోనే చాలా రాష్ట్రాల పీసీసీ సారథులను కూడా మార్చేయాలని సోనియా డిసైడ్‌ అయినట్లు ఏఐసీసీ ముఖ్యులు చెబుతున్నారు. తెలంగాణ, అసోం, తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి, యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, గోవా, మణిపూర్, గుజరాత్ రాష్ట్రాల్లో భారీ మార్పులు జరుగుతాయని అంటున్నారు. తెలంగాణ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఖాయమని ఢిల్లీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. యువతరం నాయకులకే సోనియా ఈసారి ప్రాధాన్యత ఇస్తున్నారని.. సీనియర్లకు మంగళం పాడుతున్నారన్న టాక్ ఢిల్లీలో నడుస్తోంది.

    Also Read: ట్రంప్‌నకు చైనాలో ఖాతా.. ఒబామా బిగ్‌ బాంబ్‌

    వీటన్నింటిని చూస్తుంటే.. సోనియా నెక్ట్స్‌ ఎన్నికలను టార్గెట్‌ పెట్టుకొని ఇప్పటి నుంచే తనదైన స్టైల్‌లో పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుతున్నట్లుగా అర్థమవుతోంది. ఈ మార్పులు ఎంత వరకు సక్సెస్‌ అవుతాయో కాలమే నిర్ణయించాలి మరి.