Pawan Kalyan And Uday Kiran: సినిమా ఇండస్ట్రీ ఒక రంగుల ప్రపంచం… ఇక్కడ ఎప్పుడు ఎవరు ఏ స్థాయిలో ఉంటారో చెప్పడం కష్టం…కారణం ఏంటి అంటే సక్సెస్ ఉంటేనే ఇక్కడ రెస్పెక్ట్ ఉంటుంది.అదే మనల్ని టాప్ లెవల్ కి తీసుకెళ్తుంది. అదొక్కటి లేకపోతే ఎవ్వరు పట్టించుకోరు. ఎంతోమంది హీరోలు కెరియర్ మొదట్లో ఒకటి రెండు సక్సెస్ లను సాధించి ఆ తర్వాత కాలగర్భంలో కలిసిపోయిన విషయం మనకు తెలిసిందే… ఇలాంటి క్రమంలోనే ఉదయ్ కిరణ్ లాంటి నటుడు సైతం ఒకప్పుడు గొప్ప సినిమాలను చేసి తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకున్నాడు. కానీ తన పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇండస్ట్రీలో కెరియర్ ని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తద్వారా తన ప్రాణాలను కూడా వదిలేసే పరిస్థితికి కారణమవ్వడం అనేది నిజంగా చాలా దారుణమైన విషయమనే చెప్పాలి… ఇక ఉదయ్ కిరణ్ ఫ్యామిలీకి చిరంజీవి ఫ్యామిలీతో ఏర్పడిన విభేదాల వల్లే అతను చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు అని కొందరు అంటుంటే మరికొందరు మాత్రం తన ఫ్యామిలీ లో జరిగిన కొన్ని సంఘటనలతో ఆయన సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది అని చెబుతుంటారు…
నిజానికి చిరంజీవి ఫ్యామిలీతో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ చేసిన ‘బంగారం’ సినిమాలో హీరో రాజా పోషించిన క్యారెక్టర్ ని మొదటి ఉదయ్ కిరణ్ చేత చేయించాలి అనుకున్నారట. దానికి పవన్ కళ్యాణ్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికి ప్రొడ్యూసర్స్ ఎందుకో ఆసక్తి చూపించలేకపోయారట. దానివల్ల ఆ సినిమాలో రాజా నటించి నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.
ఒకవేళ ఉదయ్ కిరణ్ కనక ఆ క్యారెక్టర్ ను చేసినట్లయితే మాత్రం మళ్లీ మంచి ఫామ్ లోకి వచ్చి ఉండేవాడు…మొత్తానికైతే ఉదయ్ కిరణ్ ఆ తర్వాత సోలో హీరోగా చాలా సినిమాలు చేసినప్పటికి అతనికి ఆశించిన విజయాలైతే వరించలేదు. దానివల్ల అతను చాలావరకు ఇబ్బందులను ఎదుర్కొని ఆ తర్వాత కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా అతను సూసైడ్ చేసుకొని చనిపోయినట్టుగా ఉదయ్ కిరణ్ వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ తెలియజేశారు…