spot_img
Homeఎంటర్టైన్మెంట్Shobhita Dhulipala: ఆ ఒక్క విషయంలో అక్కినేని ఫ్యామిలీ తో నాకు ఎలాంటి సంబంధం లేదు...

Shobhita Dhulipala: ఆ ఒక్క విషయంలో అక్కినేని ఫ్యామిలీ తో నాకు ఎలాంటి సంబంధం లేదు : శోభిత ధూళిపాళ్ల

Shobhita Dhulipala: తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి, ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ లేకుండా పాన్ ఇండియా లెవెల్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల(Sobhita Dhulipala). మిస్ ఇండియా కిరీటాన్ని కైవసం చేసుకున్న ఈమె, ‘గూఢచారి’ చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసింది. ఆ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో ఆమెకు టాలీవుడ్ లో కంటే బాలీవుడ్ లోనే ఎక్కువగా అవకాశాలు వచ్చాయి. టాలీవుడ్ లో ‘గూఢచారి’ తర్వాత ఆమె చేసిన ఏకైక చిత్రం ‘మేజర్’ మాత్రమే. రెండు కూడా అడవి శేష్ సినిమాలే కావడం విశేషం. ఇకపోతే బాలీవుడ్ లో వరుసగా అవకాశాలు సంపాదిస్తూ పెద్ద రేంజ్ కి వెళ్తున్న సమయంలోనే నాగ చైతన్య(Akkineni Naga Chaitanya) తో ప్రేమలో పడి, అతన్ని పెళ్లి చేసుకొని అక్కినేని కోడలిగా ఇంట్లోకి అడుగుపెట్టింది. పెళ్లి తర్వాత సినిమాలు మానేస్తుందేమో అని అంతా అనుకున్నారు.

కానీ అలాంటిదేమి లేదు, రీసెంట్ గానే ఆమె మళ్లీ షూటింగ్స్ లో పాల్గొనడం జరిగింది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఆమె మాట్లాడుతూ ‘ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నేను, కెరీర్ ఆరంభం నుండి నా సొంతంగా తీసుకున్న నిర్ణయాల కారణంగానే ఈరోజు ఈ స్థానంలో ఉన్నాను. సినీ ఇండస్ట్రీ లో ఒక గొప్ప నేపధ్యం లో ఉన్న కుటుంబం లోకి నేను కోడలిగా అడుగుపెట్టాను. కానీ నా పని నాదే , నా కుటుంబం నాదే, రెండు వేర్వేరు ప్రపంచాలు గానే చూస్తా. అవకాశాలు కోసం నా సినీ నేపధ్యాన్ని వాడుకోను, నా సొంత టాలెంట్ మీద వచ్చే అవకాశాలను మాత్రమే స్వీకరిస్తాను. నా అత్తామామలను కేవలం నేను కుటుంబ సభ్యులుగా మాత్రమే చూస్తాను, ఇండస్ట్రీ వ్యక్తులుగా కాదు’ అంటూ చెప్పుకొచ్చింది.

ఇక తన సెకండ్ ఇన్నింగ్స్ గురించి శోభిత మాట్లాడుతూ ‘ఇప్పుడే కాదు, మొదటి నుండి నాకు సినిమాల్లో కేవలం గ్లామర్ పాత్రల్లో మాత్రమే కనిపించడం ఇష్టం లేదు. పాజిటివ్ రోల్ అయినా, నెగిటివ్ రోల్ అయినా కథను బలమైన మలుపు తిప్పే పాత్రలు, సొంతంగా నిర్ణయాలు తీసుకునే మహిళ పాత్రలే ఇప్పటి వరకు చేస్తూ వచ్చాను. ఎవరి సపోర్టు లేకుండా ఆడిషన్స్ ద్వారానే సినిమాల్లో ఎంపిక అయ్యి ఇక్కడి వరకు వచ్చాను, భవిష్యత్తులో కూడా నా సొంత నిర్ణయాలతోనే కెరీర్ లో ముందుకు సాగుతాను’ అంటూ చెప్పుకొచ్చింది శోభిత ధూళిపాళ్ల. ఎలాంటి ఫిల్టర్ లేకుండా శోభిత మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version