Homeఎంటర్టైన్మెంట్Pandu Master: హాస్పిటల్ బెడ్ పై ఉన్న పండు మాస్టర్ కి శేఖర్ మాస్టర్ చేసిన...

Pandu Master: హాస్పిటల్ బెడ్ పై ఉన్న పండు మాస్టర్ కి శేఖర్ మాస్టర్ చేసిన గొప్ప పని చూస్తే ..సెల్యూట్ చేస్తారు..

Pandu Master: ఈటీవీ లో ప్రసారమయ్యే పాపులర్ డ్యాన్స్ షో ‘ఢీ ‘ ద్వారా కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన పండుకి మాస్టర్, రీసెంట్ గానే ఒక ఈవెంట్ కి వెళ్లి వస్తుండగా యాక్సిడెంట్ కి గురై తీవ్రంగా గాయాలపాలైన సంగతి అందరికీ తెలిసిందే. కాళ్లకు తీవమైన గాయాలు అవ్వడంతో నడవలేని పరిస్థితి ఏర్పడింది. ‘ఢీ 20’ షోలో టాప్ కంటెస్టెంట్ గా కొనసాగుతున్న పండు మాస్టర్ , ఈసారి టైటిల్ కచ్చితంగా కొడతాడని అంతా అనుకున్నారు. ఆయన ఈ సీజన్ లో ఎక్కువగా వాడిన డైలాగ్ కూడా ‘ఈ సాలా కప్ నామ్ దే’. ఈ డైలాగ్ తో ఆయన చాలా ఫన్ కూడా జనరేట్ చేశారు. రెండు మూడు సెన్సేషనల్ పెర్ఫార్మన్స్ లు కూడా ఇచ్చారు పండు మాస్టర్. అలా దూసుకుపోతున్న సమయం లో కాళ్లకు తీవ్రమైన గాయాలు అవ్వడం తో ఈ షో నుండి తప్పుకోవాల్సి వచ్చింది.

ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న పండు మాస్టర్ ని శేఖర్ మాస్టర్ నేడు కలవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆయన రావడమే కాకుండా, తన టీం మొత్తాన్ని తీసుకొచ్చి , పండు మాస్టర్ ని కలిసి ఆప్యాయంగా పలకరించారు. ఎప్పటి లాగానే ఇప్పుడు కూడా పండు మాస్టర్ చాలా సరదాగా మాట్లాడడం చూసేందుకు గొప్పగా అనిపించింది. ‘ఢీ’ సిరీస్ సమయం లోనే పండు మాస్టర్ కి శేఖర్ మాస్టర్ తో పాటు , ఆ షో లో పాల్గొన్న ప్రతీ ఒక్కరితో మంచి సాన్నిహిత్య సంబంధం ఏర్పడింది. యాంకర్ ప్రదీప్ అయితే , పండు మాస్టర్ తండ్రి కి ఆపరేషన్ సమయం డబ్బు సహాయం కూడా చేసారు. ఇలా వీళ్లంతా ఒకే కుటుంబం లాగా కలిసి పెరుగుతూ వచ్చారు. ఎల్లప్పుడూ నవ్వుతూ , అందరినీ నవ్వించే పండు మాస్టర్ కి ఇలా జరగడం తో తట్టుకోలేక పోయారు.

అది కూడా కెరీర్ పీక్ రేంజ్ కి వెళ్తున్న సమయంలో ఇలా జరగడం దురదృష్టకరం అనే చెప్పాలి. అతని టైం బాగా ఉండుంటే , కచ్చితంగా ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేవారు. కానీ దురదృష్టం చూడండి ఎలా ఉందో , దేవుడు ఎందుకు ఇలాంటి టాలెంట్ ఉన్న కుర్రాళ్లకు ఇలాంటి కష్టాలు ఇస్తారో అర్థం కాదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే పండు మాస్టర్ త్వరలోనే కోలుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు డాక్టర్లు. ఇంతకు ముందు తో పోలిస్తే ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా మెరుగుపడింది అట. ఒకవేళ పూర్తి స్థాయిలో కోలుకుంటే బిగ్ బాస్ షో కి వస్తారో లేదో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version