Sandeep Reddy Vanga And Salman Khan: అర్జున్ రెడ్డి సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ… ఆయన చేసిన సినిమాలన్నీ అతనికి గొప్ప విజయాలను సాధించి పెట్టాయి. ప్రస్తుతం ఆయన ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని శాసించే స్థాయికి ఎదిగాడనే చెప్పాలి. ప్రభాస్ తో చేస్తున్న స్పిరిట్ సినిమాతో 2000 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొట్టి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయాలనే ప్రయత్నం చేస్తున్నాడు. నిజానికి సందీప్ రెడ్డి వంగకి బాలీవుడ్ హీరోలు అంటే అస్సలు పడదు. కారణం ఏంటంటే బాలీవుడ్ మాఫియాగా కొనసాగుతున్న కొంతమంది బాలీవుడ్ హీరోలు, ప్రొడ్యూసర్స్ అతని సినిమాలను తొక్కేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. కారణం ఏంటంటే బాలీవుడ్ లో ఉన్న దర్శకులు వాళ్ళు చెప్పినట్టుగా వినాలనే కండిషన్ పెడుతారు. కానీ సందీప్ రెడ్డివంగా వాళ్ళకి వినడం లేదు. అనిమల్ సినిమాతో రణ్బీర్ కపూర్ కి గొప్ప విజయాన్ని అందించడం కూడా బాలీవుడ్ మాఫియా కి నచ్చలేదు.
ముఖ్యంగా ఖాన్ త్రయం అంటే సందీప్ రెడ్డి వంగ కి అసలు పడడం లేదు. వాళ్ళు ముగ్గురితో సినిమాలు చేయడానికి చాలా మంది దర్శకులు ప్రయత్నం చేస్తున్నప్పటికి ఈ హీరోలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. ఇక మిగతా దర్శకులందరు వాళ్ళ పర్మిషన్ లేకుండా వేరే హీరోలతో సినిమాలు చేస్తే వాళ్ళు ఒప్పుకోరు. కానీ సందీప్ రెడ్డి వంగ దానికి పూర్తి భిన్నంగా వ్యవహరిస్తూ ఉంటాడు.
తనకు నచ్చిన హీరోతో నచ్చిన కథను సినిమాగా చేయడమే అతని మెయిన్ ఎజెండా… దానికోసం అతను ఎవరి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ముందు అతను ఎవరికీ భయపడడు. ఒక హీరో తన కథను కాదు అంటే ఇంకొక హీరోకి స్టోరీ చెప్పి ఒప్పించి దాన్ని స్క్రీన్ మీదకు తీసుకు రాగలిగే సత్తా సందీప్ రెడ్డి వంగ కి ఉంది… అనిమల్ సమయంలో సందీప్ రెడ్డి వంగ ను తొక్కేయాలని చూసిన అది బాలీవుడ్ మాఫియా వాళ్ళ వల్ల కాలేదు.
దాంతో సందీప్ తో ఫ్రెండ్షిప్ చేయాలనే ప్రయత్నం చేసినప్పటికి సందీప్ వాళ్ళను పట్టించుకోవడం లేదు. ఇక సల్మాన్ ఖాన్ సైతం ఇప్పుడు సందీప్ రెడ్డి వంగతో సినిమా చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ సందీప్ మాత్రం అతన్ని పట్టించుకోవడం లేదంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి…
